దేశంలో డేటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోతాయి !

జియో రాకతో దేశంలోని టెలికాం రంగంలో ఓ సరికొత్త విప్లవం మొదలైన విషయం అందరికీ తెలిసిందే.

By Hazarath
|

జియో రాకతో దేశంలోని టెలికాం రంగంలో ఓ సరికొత్త విప్లవం మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఆకాశాన ఉన్న డేటా ధరలు నేలమీదకు దిగివచ్చాయి. ఉచిత ఆఫర్లతో జియో దిగ్గజాలకు సవాలు విసిరిన నేపథ్యంలో టెలికాం దిగ్గజాలను భారీ నష్టాలను చవిచూశాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు తక్కువ ధరకే డేటా ఆఫర్లను ప్రవేశపెట్టాయి. అయితే భవిష్యత్ లో ఇవి ఇంకా తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 

జియో, Airtelకి పోటీగా ఐడియా 84 రోజుల కొత్త ప్లాన్జియో, Airtelకి పోటీగా ఐడియా 84 రోజుల కొత్త ప్లాన్

4జీ నుంచి 5జీకి పరుగులు..

4జీ నుంచి 5జీకి పరుగులు..

దేశం 4జీ నుంచి 5జీకి పరుగులు పెడుతున్న నేఫథ్యంలో 2020 నాటికి డేటా ధరలు మరింత కిందకి పడిపోనున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. తక్కువ ధరల్లోనే సేవలందుతాయని రిపోర్టులు చెబుతున్నాయి.

ఇంటర్నెట్‌ కనెక్టివిటీకి బూస్ట్‌..

ఇంటర్నెట్‌ కనెక్టివిటీకి బూస్ట్‌..

ప్రాథమిక దశలో ఉన్న 5జీ ఆవిష్కరణ, ఇంటర్నెట్‌ కనెక్టివిటీకి బూస్ట్‌ని అందిస్తుందని హువాయి టెక్నాలజీస్‌ ప్రకటించింది.

కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత..

కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత..

ఒక్కసారి 5జీ సర్వీసులు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత, టెల్కోలకు డేటా ప్రొడక్షన్‌ వ్యయాలు ప్రస్తుతమున్న ఖర్చుల కంటే పదింతలు తగ్గుతాయని హువాయి వైర్‌లెస్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఇమ్మాన్యూల్‌ కోయెల్హో అల్వ్స్‌ చెప్పారు. దీంతో డేటా ఇంకా చౌకగా లభ్యమవుతుందని తెలిపారు.

జియో​ మార్కెట్‌లో..
 

జియో​ మార్కెట్‌లో..

దేశంలో జియో​ మార్కెట్‌లో ధరల యుద్ధానికి తెరలేపడంతో టెల్కోలు రెవెన్యూలు నష్టపోతున్నా.. కస్టమర్లను కాపాడుకోవడానికి తమ డేటా ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి.

5జీలో భారత్‌ ముందంజ..

5జీలో భారత్‌ ముందంజ..

కాగా 5జీలో భారత్‌ ముందంజలో ఉంటుందని, టెక్నాలజీ అభివృద్ధికి రూ.500 కోట్ల ఫండ్‌ను సృష్టించామని, 2020 నాటికి 5జీ సేవలను ఆవిష్కరించడానికి రోడ్‌మ్యాప్‌ కోసం ఓ హై-లెవల్‌ కమిటీని నియమించినట్టు ప్రభుత్వం తెలిపిన విషయం విదితమే.

Best Mobiles in India

English summary
5G can reduce data cost for telcos substantially: Huawei More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X