5G mmWave పబ్లిక్ Wi-Fi కంటే ఎంత మెరుగ్గా ఇంటర్నెట్ స్పీడ్ ను అందిస్తుంది???

|

5G రాకతో ఇంటర్నెట్ వినియోగంలో వినూత్న మార్పులు రానున్నాయి. అయితే దీని యొక్క ప్రభావం పబ్లిక్ వై-ఫై లపై తీవ్రంగా పడనుంది. 5G mmవేవ్ సాయంతో ఇంటర్నెట్ స్పీడ్ పెరగనున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G కూడా పబ్లిక్ వై-ఫై కంటే మెరుగైన వేగంతో లభిస్తుంది. MmWave 5G మరియు పబ్లిక్ వై-ఫై స్పాట్‌ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 MMWave 5G
 

టెలికాం సంస్థలు మరియు బ్రాడ్బ్యాండ్ సంస్థలు వినియోగదారులకు మంచి కనెక్షన్‌ని అందించడానికి వాటికి ఒక రకమైన లభ్యత అవసరం ఉంటుంది. ఆపరేటర్లు mmWave 5G సేవలను అందించడానికి వారు నగరం మొత్తం ప్రాంతాన్ని mmWave యాంటెన్నాలతో కవర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే MMWave 5G వినియోగదారులు చాలా ఎక్కువ పౌనపున్యాలు కలిగి ఉంటారు. ఇది Wi-Fi వలె చిన్న కవరేజీని కలిగి ఉండి మెరుగైన వేగంతో ఇంటర్నెట్ ను అందిస్తుంది.

5G ఫ్రీక్వెన్సీ

ఓపెన్‌సిగ్నల్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం యుఎస్ అంతటా చాలా మంది వినియోగదారులు mm‌వేవ్‌తో నిజమైన 5Gని అనుభవించరు. బదులుగా వారు 6GHz లోపు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5G సేవలను పొందుతున్నారు. 6 GHz లోపు బ్యాండ్‌లపై 5G తో ఓపెన్‌సిగ్నల్ యూజర్లు 63.9 Mbps డౌన్‌లోడ్ వేగాన్ని పొందగలిగారు. అంటే ఇది పబ్లిక్ వై-ఫై కంటే 3x వేగంగా ఉంటుంది. అయినప్పటికీ mmWave 5G తో డౌన్‌లోడ్ స్పీడ్ పబ్లిక్ Wi-Fi తో పోలిస్తే 30x వేగంగా ఉంది. ఓపెన్‌సిగ్నల్ యొక్క విశ్లేషణ బృందం నాయకుడు ఇయాన్ ఫాగ్ mmవేవ్ 5G మరియు పబ్లిక్ వై-ఫై మధ్య గల స్పీడ్ వ్యత్యాసానికి మూడు కారణాలను పేర్కొన్నారు.

పబ్లిక్ వై-ఫై కంటే mmవేవ్ 5G వేగంగా ఉండడానికి కారణాలు
 

పబ్లిక్ వై-ఫై కంటే mmవేవ్ 5G వేగంగా ఉండడానికి కారణాలు

ఓపెన్‌సిగ్నల్ యొక్క విశ్లేషణ బృందం నాయకుడు ఇయాన్ ఫాగ్ యొక్క పరిశీలన తరువాత పబ్లిక్ వై-ఫై కంటే mmవేవ్ 5G వేగంగా ఉండడానికి మొదటి కారణం ‘ఇతర సంకేతాల జోక్యం'. పబ్లిక్ వై-ఫై లైసెన్స్ లేని స్పెక్ట్రంను ఉపయోగిస్తుంది. అది ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు. అటువంటి ప్రాంతాల్లో అనేక వై-ఫై నెట్‌వర్క్‌లు ఒకే పౌనపున్యాలను స్వీకరించడానికి పోటీ పడుతున్నాయి. నివాస ప్రాంతాలలో చాలా తక్కువ భవనాలు ఉన్న ప్రాంతాలలో వై-ఫై నెట్‌వర్క్‌ల మధ్య పోటీ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ వేగంను కలిగి ఉంటుంది. మరోవైపు 5G మరియు 4G నెట్‌వర్క్‌లు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించే ఆపరేటర్‌కు లైసెన్స్ పొందిన అంకితమైన పౌనపున్యాలను ఉపయోగిస్తాయి.

ఒల్దర్ టెక్నాలజీ ఫౌండేషన్

ఫాగ్ తెలిపిన రెండవ కారణం ‘ఒల్దర్ టెక్నాలజీ ఫౌండేషన్'. పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లు వైర్డు బ్రాడ్‌బ్యాండ్ ద్వారా శక్తిని పొందుతాయి. ఆ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ అనేది చాలా సంవత్సరాల క్రితం ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇంకా దీనిని అప్ డేట్ చేయకపోతే కనుక అధిక వినియోగదారుల సామర్థ్యాన్ని ఇది నిర్వహించదు. దీనిని పోల్చి చూస్తే కనుక ఆపరేటర్లు బ్యాక్‌హాల్ కనెక్షన్‌ను ప్రతి సెల్యులార్ బేస్‌కు అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంటారు. తద్వారా వైర్డు కనెక్టివిటీ వారి వినియోగదారుల ఇంటర్నెట్ అనుభవానికి ఎప్పుడూ అంతరాయం కలిగించదని నిర్ధారిస్తుంది.

అధిక-నాణ్యత Wi-Fi

చివరగా ఫాగ్ తెలిపిన మూడవ కారణం ‘అధిక నాణ్యత గల తగినంత Wi-Fi యాక్సెస్ పాయింట్లు'. అధిక-నాణ్యత Wi-Fi యాక్సెస్ పాయింట్లు ప్రతిచోటా మంచి సిగ్నల్ ను పంపిణీ చేయబడతాయని నిర్ధారిస్తుంది. కాకపోతే వినియోగదారులకు మొత్తం అనుభవం క్షీణిస్తుంది. ఈ రోజు ఆమోదయోగ్యమైన లేదా మంచి నాణ్యత గల వై-ఫై ప్రమాణాలు వై-ఫై 5 మరియు వై-ఫై 6. ఆధునిక రౌటర్లు సాధారణంగా వాటిపై ఇన్‌స్టాల్ చేయబడిన సరికొత్త వై-ఫై ప్రమాణాలతో వస్తాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
5G mmWave How Much Better Internet Speed Than Public Wi-Fi?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X