Home
News

5G వచ్చాక మీ ఫోన్‌ ఎక్కువసార్లు ఛార్జింగ్‌ పెట్టాల్సి వస్తోందా..? కారణమిదే..!

మీరు ఒక రోజులో ఎక్కువసార్లు మీ ఫోన్‌ను ఛార్జింగ్‌ చేయాల్సి వస్తోందా? గతం కంటే చాలా వేగంగా బ్యాటరీ డిశ్చార్జి అయిపోతుందా? 5G నెట్‌వర్క్ వినియోగిస్తున్నప్పటి నుంచే ఈ పరిస్థితి ఎదురవుతుందా.. అయితే ఈ సమస్య మీ ఒక్కరిదో లేక మీ ఫోన్‌లోనో సమస్య లేదు. ఈ సమస్య 5G నెట్‌వర్క్‌ వినియోగిస్తున్న అందిరికీ ఉంది. 5G అనేది టెలికాం రంగంలో కొత్త టెక్నాలజీ మరియు గతంలో మీరు వినియోగించిన 4G నెట్‌వర్క్‌ కంటే ఎక్కువ బ్యాటరీని ఉపయోగించుకుంటుంది.

ఫోన్ బ్యాటరీ త్వరగా ఎందుకు డిశ్చార్జి అవుతుందంటే.. కొన్ని 5G నెట్‌వర్క్ అందించే సంస్థలు ఇంకా తమకున్న 4G నెట్‌వర్కింగ్ వ్యవస్థపైనే ఆధారపడి 5G (NSA 5G) సాంకేతికతను అందిస్తున్నాయి. 3G, 4G నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ నుంచే హైస్పీడ్‌ 5G ఇంటర్నెట్‌, కాల్స్, SMSల సేవలను టెలికాం సంస్థలు అందిస్తున్నాయి.

5G Network

3G, 4G రెండు నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలకు సంబంధించిన వేర్వేరు పరికరాలు మీ ఫోన్‌కు కనెక్ట్ కావడంతో మీ మొబైల్‌ బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అయిపోతోంది. అదే పూర్తిగా 5G నెట్‌వర్కింగ్‌ వ్యవ్యస్థపైనే ఆధారపడి 5G సాంకేతికను అందిస్తే, అప్పుడు మీ బ్యాటరీ త్వరగా డిశ్చార్జి కాదు.

మీ ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవాలనుకున్నా లేదా మీరు ఎక్కడికైనా ప్రయాణిస్తున్న సమయంలో మీ ఫోన్‌లో ఛార్జింగ్‌ ఎక్కువ సమయం రావాలన్నా.. మీరు మళ్లీ 4G నెట్‌వర్క్‌కు మారవచ్చు. అప్పుడు ఎప్పటిలాగానే మీ ఫోన్‌ బ్యాటరీ ఎక్కువ సమయం డిశ్చార్జి కాకుండా ఉంటుంది. ఈ కింది విధంగా మీ ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌ నుంచి 5G నెట్‌వర్క్‌ నుంచి 4Gకి మారిపోవచ్చు.

మీరు ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగిస్తుంటే ఈ కింది పద్దతి ద్వారా 4G నెట్‌వర్క్‌కు మారవచ్చు.

స్టెప్ 1 : మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సెట్టింగ్‌లను ను ఓపెన్‌ చేయండి.
స్టెప్ 2 : అనంతరం సెట్టింగ్స్‌లో ఉన్న కనెక్షన్లులోకి వెళ్లి మొబైల్‌ నెట్‌వర్క్‌ను సెలక్ట్‌ చేయండి.
స్టెప్ 3: మొబైల్‌ నెట్‌వర్క్‌ మెనులో నుంచి నెట్‌వర్క్‌ మోడ్‌ను ఎంచుకోండి.
స్టెప్ 4: అందులో మీరు చాలా నెట్‌వర్క్‌లను గమనించి ఉంటారు. అందులో నుంచి 'LTE/3G/2G (ఆటో కనెక్ట్‌)' ను ఎంచుకోవాలి. అప్పటి నుంచి మీరు 4G నెట్‌వర్క్‌ను మాత్రమే కనెక్ట్‌ అవుతారు. మీ ఫోన్‌ బ్యాటరీ కూడా ఎక్కువ సమయం వస్తుంది.

మీరు ఐఫోన్‌ వినియోగదారులైతే ఈ కింది పద్దతి దారా 5G నుంచి 4Gకి మారవచ్చు.

స్టెప్ 1: మీ ఐఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్‌ చేయండి.
స్టెప్ 2: సెట్టింగ్‌ మెనులో నుంచి సెల్యూలర్‌ను ఎంచుకోండి.
స్టెప్ 3: సెల్యూలర్‌ మెనూ నుంచి సెల్యూలర్‌ డేటా ఆప్షన్‌ పైన క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఆ తర్వాత వాయిస్‌&డేటా పైన క్లిక్ చేయండి.
స్టెప్ 5: అనంతరం అక్కడ కనిపించిన LTE పైన క్లిక్‌ చేసి 5G నెట్‌వర్క్‌ను డిసేబుల్‌ చేయండి.

దీంతోపాటు ఐఫోన్‌ వినియోగదారులు 5G Auto మోడ్‌ ఎంచుకుంటే, ఆటోమేటిక్‌గానే 5G నెట్‌వర్క్‌ డియాక్టివేట్‌ అవుతుంది. ప్రస్తుతం ఐఫోన్‌ 12 సీరిస్‌ మరియు ఆ తర్వాత వచ్చిన మోడళ్లు మాత్రమే 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తున్నాయని గమనించగలరు.

Best Mobiles in India

English summary
5G network drains phone battery early than 4G, and do you know how to switch 5G to 4G network
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X