Home
News

5G నెట్‌వర్క్‌ వినియోగిస్తున్నారా... డేటా స్పీడ్‌లో మార్పులు గమనించారా..??

భారత్‌లో 5G నెట్‌వర్క్‌ విస్తరణ వేగంగా జరుగుతోంది. అనేక మంది యూజర్లు 5G సర్వీసులను ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, జియో వంటి సంస్థలు దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాలకు 5G నెట్‌వర్క్‌ను విస్తరించాయి. VI వోడాఫోన్ ఐడియా కూడా త్వరలో 5G నెట్‌వర్క్‌ను (5G Network Data Speed) అందుబాటులోకి తీసుకొనేందుకు ప్రయత్నం చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థ 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. 5G రీఛార్జి ప్లాన్‌లను విడుదల చేయలేదు. ప్రస్తుతానికి ఉచితంగానే డేటాను అందిస్తున్నాయి.

ప్రస్తుతం అందుబాటులోకి వస్తోన్న 5G నెట్‌వర్క్‌ డేటా వేగం.. 4G కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తాజా నివేదిక ఓ కీలక అంశాన్ని వెల్లడించింది. 5G నెట్‌వర్క్‌ నాణ్యత ‌తగ్గుతోందని తెలిపింది. గతంతో పోలిస్తే డౌన్‌లోడ్‌ వేగం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. ఓపెన్‌ సిగ్నల్‌ (Open Signal Report) ఈ నివేదికను విడుదల చేసింది.

opensignal report on 5G data speed

2023 మొదటి మూడు నెలల్లో 5G సగటు డౌన్‌లోడ్‌ వేగం 304Mbps గా ఉంది. అదే సంవత్సరం ఆఖరి మూడు నెలలు 280.7Mbps వేగానికి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో OTT, ఆన్‌లైన్‌ షాపింగ్‌ సహా గేమింగ్‌ కారణంగా పీక్‌ అవర్స్‌లో (రద్దీ వేళలు) డౌన్‌లోడ్‌ వేగం తక్కువగా ఉంది. అయితే అధిక వినియోగమే ఇందుకు కారణం కావచ్చని తెలిపింది.

ఎయిర్‌టెల్‌ 5G నెట్‌వర్క్‌ పనితీరు కొన్ని రాష్ట్రాల్లో మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది. 2023 సంవత్సరం తొలి మూడు నెలల్లో ఎయిర్‌టెల్‌ సరాసరి డౌన్‌లోడ్‌ వేగం 260Mbps గా ఉంది. అదే 2024 సంవత్సరం తొలి మూడు నెలలకు వచ్చే సరిగా 273.6Mbps గా ఉంది.

opensignal report on 5G data speed

అదే సమయలో జియో నెట్‌వర్క్ వేగం గత సంవత్సరంతో పోలిస్తే క్రమంగా తగ్గుతోంది. 2023 తొలి మూడు నెలలు జియో 5G సరాసరి వేగం 323.6Mbps గా ఉంది. అదే 2024 తొలి మూడు నెలల్లో ఈ వేగం 261.8Mbps గా ఉంది. పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, అస్సోం వంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది.

* ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు వినియోగదారుడిని ఆకట్టుకొనేందుకు అందుబాటులో ధరలో ప్రీపెయిడ్‌ రీఛార్జి ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కలిగి రీఛార్జీ ప్లాన్‌లను కూడా విడుదల చేస్తేంది. ఇటీవలే జియో రూ.9 తో డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గంటపాటు 10GB డేటాను వినియోగించుకోవచ్చు.

* ఇటీవలే ఎయిర్‌టెల్‌ రూ.279 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్‌తో 45 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా 600 SMSలను పొందవచ్చు. అయితే కేవలం 2GB డేటాను మాత్రమే పొందవచ్చు. వీటితోపాటు Wync మ్యూజిక్‌, Hellotunes ఉచితంగా వినియోగించుకోవచ్చు. మూడు నెలలపాటు అపోలో 24|7 సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
5G Network internet speed drop in many places says open signal report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X