ఇండియాలో 200 సిటీ లకు పైగా 5G నెట్ వర్క్! డెడ్ లైన్ ఎప్పుడంటే ...?

By Maheswara
|

భారత దేశం లో అక్టోబర్ 1 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 5G సేవలు లాంచ్ చేసారు. ప్రస్తుతం, భారతదేశంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలలోనే అదికూడా ప్రైవేట్ ఉపయోగానికి మాత్రమే 5g సేవలను కొన్ని టెలికాం సంస్థలు అందిస్తున్నాయి. ఇక రాబోయే కొన్ని నెలల్లో మరిన్ని భారతీయ నగరాలు 5G సేవలను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో తక్కువ నగరాల్లో 5G సేవలు ప్రారంభించబడ్డాయి. మార్చి 2023 నాటికి, ఒడిశాలోని కనీసం 4 నగరాలు 5Gని కలిగి ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5g పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి, రాష్ట్రంలోని 80%కి పైగా మొదటి దశలో 5G సేవలకు ప్రాప్యతను కలిగి ఉంటుంది, ఇది మార్చి 2023 నాటికి ఒడిషాలోని నాలుగు నుండి ఐదు నగరాలకు సేవను అందుకుంటుంది.

 

5G సేవల ప్రారంభం గురించి మరిన్ని వివరాలు

5G సేవల ప్రారంభం గురించి మరిన్ని వివరాలు

రిలయన్స్ జియో ప్రారంభంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు వారణాసిలలో మాత్రమే 5G సేవలను అందిస్తోంది. మరోవైపు, ఇతర నగరాలకు 5G రోల్‌అవుట్‌ను విస్తరించడంలో Airtel విజయం సాధించింది. వీటిలో చెన్నై, ఢిల్లీ, వారణాసి, ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా మరియు బెంగళూరు ఉన్నాయి. ఇతర నగరాలు 5Gకి సిద్ధంగా ఉన్నందున, వారు అక్కడ 5Gకి మద్దతునిస్తారని టెల్కోలు పేర్కొన్నాయి.

నివేదికల ప్రకారం

నివేదికల ప్రకారం

నివేదికల ప్రకారం, 5G గరిష్టంగా 20 Gbps లేదా 100 Mbps కంటే ఎక్కువ డేటా బదిలీ వేగాన్ని కలిగి ఉంటుంది. దీనిని పోల్చి చూస్తే, 4G గరిష్టంగా 1 Gbps వేగాన్ని అందిస్తుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ఈవెంట్‌లో చేసిన నెట్వర్క్ పరీక్షలలో, Airtel 5G నెట్వర్క్ 1.8 Gbps డౌన్‌లోడ్ వేగం మరియు 100 Mbps కంటే ఎక్కువ అప్‌లోడ్ వేగాన్ని అందించింది.

సమాచారం ప్రకారం
 

సమాచారం ప్రకారం

వైష్ణవ్ అందించిన సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది మార్చి నాటికి దేశం మొత్తం పైన 200 కంటే ఎక్కువ నగరాలకు 5g కవరేజ్ చేయగలమని, పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు 5G సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది అని చెప్పారు. ప్రస్తుతం ఈ నగరాల పేర్లు తెలియవు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) యొక్క మునుపటి ప్రకటన ప్రకారం, 13 పెద్ద నగరాలు ముందుగా 5Gని పొందుతాయి అని ప్రకటించింది, కానీ అలా జరగలేదు.

Vodafone Idea అందించే 5G సేవలు గురించిన విషయాలు ఇప్పటికీ తెలియవు. భారతదేశం అంతటా టెల్కోలు కొనసాగుతున్న 5G పరీక్షల కారణంగా, ఏ సంస్థ కూడా తమ 5G ప్లాన్‌ల ధరలను ఇంకా వెల్లడించలేదు; అందువల్ల వీరంతా ప్రస్తుతం సరికొత్త నెట్‌వర్క్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

5G స్కామ్

5G స్కామ్

ఇది ఇలా ఉంటే 5g పేరు వాడుకొని కొందరు వినియోగదారులను మోసం చేస్తున్నారు.ఈ స్కామ్ యొక్క వివరాలు ప్రకారం, అమాయక వ్యక్తులకు కాల్‌లు చేసి, వారి స్మార్ట్‌ఫోన్‌లలో వచ్చిన లింక్‌లను క్లిక్ చేసిన తర్వాత మోసగాళ్ళు బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును పోగొట్టుకున్నట్లు అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి.ఇది చాలా తీవ్రమైన మోసం కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ వింగ్ హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఇలాంటి 5G స్కామ్‌లకు దూరంగా ఉండండి.

5G నెట్‌వర్క్‌కి అప్‌గ్రేడ్

5G నెట్‌వర్క్‌కి అప్‌గ్రేడ్

తొలుత, కొంతమంది స్కామర్‌లు వినియోగదారుల ఫోన్‌లకు ప్రమాదకరమైన లింక్‌ను పంపుతారు. అంటే వారు ఈ లింక్ ద్వారా మీ సిమ్ 4G నుండి 5G నెట్‌వర్క్‌కి అప్‌గ్రేడ్ చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుందని అని చెప్తారు. కానీ 5G ని పొందాలనే ఆసక్తితో ఉన్న ప్రజలు, ఇది కొన్ని అధికారిక వార్తగా భావించి, ఈ లింక్‌పై క్లిక్ చేస్తారు, కానీ వాస్తవానికి ఇది సైబర్ నేరగాళ్లచే పంపబడి ఉండటం వల్ల మీరు దోపిడీ కి గురయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త.

Best Mobiles in India

Read more about:
English summary
5G Rollout In India: More Than 200 Cities Will Get 5G Network By March 2023. Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X