2022 Q1లో ఇండియాలో 5G స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ 300 రెట్లు పెరిగింది...

|

టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆయా దేశాలలో టెలికాం యొక్క నెట్‌వర్క్ ని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా తమ స్మార్ట్‌ఫోన్లలో కనెక్టివిటీని పెంచుతున్నాయి. భారతదేశంలో ప్రస్తుతానికి 4G కనెక్టివిటీ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే 5G కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది టెలికాం సంస్థలు వాగ్దానం చేయడంతో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు అన్ని కూడా తమ యొక్క వినియోగదారులకు తక్కువ ధరలోనే 5G స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. దీని కారణంగా 5G స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్ 2022 మొదటి త్రైమాసికంలో గత సంవత్సరంతో పోలిస్తే 300% వరకు గణనీయంగా పెరిగిందని సైబర్‌మీడియా రీసెర్చ్ కొత్తగా విడుదల చేసిన నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం శామ్సంగ్ మరియు షియోమి కంపెనీలు అధిక శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సెగ్మెంట్లో శామ్సంగ్ 23% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయితే షియోమి కంపెనీ మార్కెట్ వాటాలో 18% వరకు కలిగి ఉంది. Q1 2022లో 5G స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ పనితీరును నిశితంగా పరిశీలిద్దాం.

2022లో ఇండియా 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్

2022లో ఇండియా 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్

2022 మొదటి త్రైమాసికంలో 5G స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు బలమైన వృద్ధిని నమోదు చేశాయని అనలిస్ట్-ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. Q1 2019 యొక్క ప్రీ-పాండమిక్ స్థాయిలతో పోలిస్తే మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 16% గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన మార్కెట్‌లో మొత్తం వృద్ధి 1.6% ఉందని సంస్థ తన నివేదికలో పేర్కొంది. 2022 క్యాలెండర్ సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్లు సుమారు 170 మిలియన్ యూనిట్లకు పైగా రవాణా చేయబడే అవకాశం ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది.

2022 క్యాలెండర్ సంవత్సరం

2022 క్యాలెండర్ సంవత్సరం మొదటి త్రైమాసికంలో షియోమి బ్రాండ్‌ 24%, శామ్సంగ్ బ్రాండ్‌ 19% మరియు రియల్ మి బ్రాండ్‌ 15% షిప్‌మెంట్‌లతో మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. తర్వాత నాలుగు మరియు ఐదు స్థానాలలో వరుసగా వివో 14%తో మరియు ఒప్పో 8% తో ఉన్నాయి. శామ్సంగ్ మరియు రియల్ మి తమ షిప్‌మెంట్‌లలో వరుసగా 7% మరియు 40% వృద్ధిని నమోదు చేసుకోగా షియోమి బ్రాండ్ మాత్రం తన షిప్‌మెంట్‌లలో 13% క్షీణతను చవిచూసింది. ప్రముఖ తయారీదారు వన్‌ప్లస్ సంస్థ తన యొక్క 5G షిప్‌మెంట్‌లో సంవత్సరానికి 50% వృద్ధిని సాధించింది. అలాగే ఆపిల్ బ్రాండ్ సంవత్సరానికి 20% వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ వాటాలో దాదాపు 77% ఉన్నందున ఆపిల్ సూపర్-ప్రీమియం ధరల విభాగంలో రూ. 50,000 నుండి రూ. 1,00,000 మధ్య ఉందని డేటా వెల్లడిస్తుంది.

IDC

చాలా నివేదికల ప్రకారం ముడి సరుకుల సరఫరా సమస్యలు మరియు ద్రవ్యోల్బణం భయాల కారణంగా 2022 మొదటి త్రైమాసికంలో షిప్‌మెంట్ క్షీణతను సూచిస్తున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) నివేదిక ప్రకారం దేశంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు మొదటి త్రైమాసికంలో 37 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. 2022 మొదటి త్రైమాసికంలో షిప్‌మెంట్‌లో సంవత్సరానికి 5% క్షీణత ఉందని ఇది సూచిస్తుంది. షియోమి బ్రాండ్ ఇండియా మార్కెట్లో తన మొదటి స్థానాన్ని కొనసాగించగలిగింది. అయితే ఈ త్రైమాసికంలోని షిప్‌మెంట్‌లలో పెరుగుదలను చూసిన ఏకైక బ్రాండ్ రియల్ మి మాత్రమే.

Best Mobiles in India

English summary
5G Smartphone Shipment Will Increase Up to 300% in India 2022 Q1

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X