ఇండియాలో ఇప్పుడు 5G స్మార్ట్‌ఫోన్‌లను కొనడం అవసరమా?

|

ప్రపంచం మొత్తం అన్ని రంగాలలోను అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్నది. ఇండియా కూడా అన్ని రంగాలలోను అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ముందుకు సాగుతున్నది. 5G నెట్‌వర్క్ కొన్ని దేశాలలో మొదలైనప్పటికీ ఇండియాలో ఇంకా చర్చనీయ దశలోనే ఉంది. 2021 రెండవ త్రైమాసికంలో 5G నెట్‌వర్క్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల టెలికాం సంస్థలలో ఒకటైన జియో చైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించాడు. ఇండియాలో గత నాలుగు నెలలుగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సంస్థలు 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడం మొదలెట్టాయి. అయితే ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ఎంత వరకు ఉపయోగకరమో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియాలో 5G స్మార్ట్‌ఫోన్‌ల హవా

ఇండియాలో 5G స్మార్ట్‌ఫోన్‌ల హవా

ప్రస్తుతం అన్ని స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను 5G ఫీచర్లతో అది కూడా అధిక ధర వద్ద తయారుచేస్తున్నారు. ఇప్పటికే వన్ ప్లస్, వివో, మోటో సంస్థలు తమ 5G ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో విడుదల చేసాయి. చైనా యొక్క స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు షియోమి మరియు రియల్ మి సంస్థలు కూడా తమ 5G ఫోన్ లను లాంచ్ చేసే పనిలో ఉన్నాయి.

 

Also Read: Vivo V20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది!!! ధర ఎంతో తెలుసా!!Also Read: Vivo V20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది!!! ధర ఎంతో తెలుసా!!

4G నెట్‌వర్క్ vs 5G నెట్‌వర్క్

4G నెట్‌వర్క్ vs 5G నెట్‌వర్క్

ఇండియాలోని అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు ప్రస్తుతం 4G నెట్‌వర్క్ ను విస్తారంగా కలిగి ఉన్నాయి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో 2G మరియు 3G 4G నెట్‌వర్క్ లను మాత్రమే కలిగి ఉన్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G నెట్‌వర్క్ సాయంతో వినియోగదారులు తమ యొక్క అన్ని రకాల అవసరాలను ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా పూర్తి చేస్తున్నారు. 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే కొద్దిగా డేటా స్పీడ్ పెరగడంతో పాటుగా రీఛార్జ్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. 2G/3G అందుబాటులో ఉన్నప్పుడు గల ధరలతో ప్రస్తుత ధరలను పోలిస్తే కనుక చాలా వ్యతాసం ఉంది.

5G ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లు ఎంత వరకు ఉపయోగకరం!!

5G ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లు ఎంత వరకు ఉపయోగకరం!!

ఇండియాలో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంత తక్కువ లేదన్న 6నెలల సమయం పడుతుంది. అంతకు మించి సమయం పట్టిన ఆశ్చర్య పోవలసింది లేదు. ప్రతి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెండు నెలలకు ఒకటి లేదా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అలాగే జనాలు కూడా ప్రతి 6 నెలలు లేదా 9 నెలలకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనడానికి ఇష్టపడుతున్నారు. అంటే మనం ఒక సంవత్సరంకు మించి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం లేదు. కావున ప్రస్తుతం 5G స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఒక్క నెట్‌వర్క్ ఫీచర్ సమస్య తప్ప మిగిలిన అన్ని ఫీచర్లను 4G వోల్ట్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటు ధరలోనే అందిస్తున్నాయి. కావున ఇందులో దేనిని ఎంచుకోవడం అనేది మీ యొక్క ఛాయస్...

Best Mobiles in India

English summary
5G Smartphones Really Useful or Not in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X