5జీ ఇండియాని ఎలా మార్చబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

దేశంలోని చాలా ప్రాంతాల్లో టెలిఫోన్ కనెక్టివిటీతోపాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా వచ్చేసింది. చాలా ఏరియాలు 2జీ నుంచి 3జీకి అప్‌డేట్ అయ్యాయి. నగరాల్లో 3జీ నుంచి 4జీలోకి మారిపోతున్నాయి.

By Gizbot Bureau
|

దేశంలోని చాలా ప్రాంతాల్లో టెలిఫోన్ కనెక్టివిటీతోపాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా వచ్చేసింది. చాలా ఏరియాలు 2జీ నుంచి 3జీకి అప్‌డేట్ అయ్యాయి. నగరాల్లో 3జీ నుంచి 4జీలోకి మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 5జీ చర్చ నడుస్తోంది. 2035 నాటికి దీనివల్ల 12 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కెట్ అంచనా వేస్తోంది.

5జీ ఇండియాని ఎలా మార్చబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

అయితే 5జీ వస్తే.. కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ హైస్పీడ్ కనెక్టివిటీ దేశ స్వరూపాన్నే మార్చోబోతంది. సూపర్‌ఫాస్ట్ 5జీ మొబైల్ ఇంటర్నెట్ వచ్చే ఏడాది రంగంలోకి దిగుతోంది. అది ఇప్పుడున్న డౌన్‌లోడ్ స్పీడ్ కన్నా 10, 20 రెట్లు అధికంగా ఉంటుందని చెప్తున్నారు. 5జీ ఇండియాని ఎలా మార్చేయబోతుందో ఓ సారి చూద్దాం.

ఐవోటీ జమానా

ఐవోటీ జమానా

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు కేవలం కొన్ని వాటి అంశాలకే పరిమితమైంది. 5 జీ వస్తే.. ఇక ప్రతీ వస్తువూ నెట్‌కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. 2030 నాటికి 125 బిలియన్ డివైజులు హై స్పీడ్ నెట్‌కు కనెక్ట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఎక్కువ ప్రయార్టీ ఉంటుంది. అప్పుడు మీరు దేశంలో ఎక్కడైనా కూర్చుని మీ ఇంట్లోని వస్తువులను ఆపరేట్ చేయొచ్చు. మీ నోటి మాటతో గ్రాసరీ సామాన్లు కూడా మీ ఇంటికి డెలివరీ అయిపోతాయి. అది కూడా మనుషులతో ఏ మాత్రం సంబంధం లేకుండా. మీ ఇంట్లోని వస్తువులు మరింత స్మార్ట్‌గా మారి మీకు చాలా ఉపయోగపడ్తాయి.

ట్రాన్స్‌పోర్ట్ - లాజిస్టిక్స్

ట్రాన్స్‌పోర్ట్ - లాజిస్టిక్స్

డ్రైవర్ లెస్ కార్ల జమానా వచ్చేయొచ్చు. ఇప్పటికే యాపిల్ - ఉబెర్ సంస్థలు డ్రైవర్‌లెస్ కార్లపై విపరీతంగా ఖర్చు చేసి మంచి పురోగతి సాధించాయి. 5 జీ వస్తే.. మైక్రో సెకెన్లలో డేటాను ప్రాసెస్ చేసి తక్షణ నిర్ణయాన్ని సదరు వెహికల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్‌గా డ్రైవర్ లెస్ కార్లను చూడలేకపోతున్నాం. రాబోయే రోజుల్లో కార్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులు, ట్యాక్సీలు కూడా డ్రైవర్లు లేకుండానే రోడ్లపై పరుగులు తీస్తాయి.

 హెల్త్ కేర్

హెల్త్ కేర్

మీకు ఏదైనా జ్వరం వచ్చిందని అనుకుందాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు. మీరు మొబైల్ హాస్పిటల్ బుక్ చేసుకుంటే అదే మీ ఇంటి దగ్గరికి వచ్చి నిలబడ్తుంది. అందులో మీకు టెస్టులు కూడా జరిగిపోవచ్చు. రియల్ టైంలో టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్‌తో ఆన్‌లైన్‌లో మాట్లాడేసి ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ కేవలం 5జీ వంటి హైస్పీడ్ వంటివాటితోనే సాధ్యం. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి బాగా ఉపయోగపడొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనలిటిక్స్, ఆగ్మెంటెడ్ రియాల్టీ వంటివాటితో మొత్తం హెల్త్ కేర్ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోవచ్చు.

ఆఫీసులో..

ఆఫీసులో..

ఆఫీస్ సంగతి మళ్లీ చెప్పాలా. రోడ్డుపైనే ఇంత స్మార్ట్‌గా మారిపోతే.. ఆఫీసులో మరింత అడ్వాన్స్ టెక్నాలజీలు అందుబాటులోకి రావొచ్చు. కంప్యూటర్‌లతో మాట్లాడేవారు (ప్రోగ్రామింగ్ వచ్చినవాళ్లు) ఉద్యోగాల్లో పెరిగిపోతారు. రొటీన్ జాబ్స్‌కు కంప్యూటర్లే ఆల్టర్నేటివ్స్ చూపించేస్తాయి. అంటే వైట్ కాలర్ జాబ్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. స్మార్ట్ మెషీన్లతో పోటీపడే కెపాసిటీ అయినా ఉండాలి, లేకపోతే వాటిని నడిపించే సామర్ధ్యం అయినా ఉండాలి. అప్పుడే మనం జాబ్ మార్కెట్లో సేఫ్‌గా ఉండగలం. రొటీన్ అకౌంటెంట్ జాబ్స్, క్లరికల్ జాబ్స్‌కు కూడా ఎసరు రావొచ్చు.

ఫ్యాక్టరీల్లో..

ఫ్యాక్టరీల్లో..

ఫ్యాక్టరీల్లో కూడా ఆటోమేషన్ పెరిగిపోతుంది. మనుషుల కంటే టెక్నాలజీని నమ్మేందుకే సంస్థలు ఎక్కువగా మొగ్గుచూపిస్తాయి. ఎందుకంటే ప్రొడక్టివిటీ పెంచుకునేందుకు ఇవి ఎక్కువగా దోహదపడతాయి. అలా కాని పక్షంలో రియల్ టైం డేటాను ఎనలైజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. స్మార్ట్‌గా, వేగంగా పనిచేసే వాళ్లకే ఫ్యూచర్ ఎక్కువ.

 సెక్యూరిటీ వార్

సెక్యూరిటీ వార్

పాజిటివ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో.. నెగిటివ్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే మన జీవితం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతాయి కాబట్టి సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వైరస్, డేటా థెప్ట్, హ్యాకింగ్ బారిన పడితే.. బతుకు రోడ్డున పడ్డట్లే. దేశ భద్రత విషయంలో మరింత అప్రమత్తత అవసరం. ఎందుకంటే ఓ చిన్న టిక్ టాక్ వంటి యాప్ మన డేటాను మొత్తం చౌర్యం చేస్తోంది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో మొత్తం మనం నెట్ పైనే ఆధారపడితే అప్పుడు పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
5G isn't just extraordinary internet speed, it's a huge leap forward Here's how 5G technology will transform the world around us.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X