5జీ ఇండియా,వచ్చే ఏడాది మనం 5Gలోకి అడుగుపెట్టబోతున్నాం !

By Gizbot Bureau
|

4జీని పూర్తిగా ఆస్వాదించకుండానే మనం 5జీ టెక్నాలజీలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతి ఏడాది ఇంటర్‌నెట్ స్పీడుకు సంబంధించిన పరిణామాలు అత్యంతవేగంగా మారిపోతున్నాయి. సాధారణ ప్రజానీకానికి 3జీ,4జీ,5జీ అంటే తెలియకపోవచ్చు. కానీ వారు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ విషయం వచ్చేసరికి మాత్రం ఈ పేర్లు ఖచ్చితంగా పలకడం సామాన్యంగా మారిపోయింది.

 5జీ ఇండియా,వచ్చే ఏడాది మనం 5Gలోకి అడుగుపెట్టబోతున్నాం !

గత రెండేళ్ల క్రితం 2జీ టెక్నాలజీతో ఫోన్లు పనిచేసేవి. ఆతర్వాత 3జీ వచ్చేసింది. అది కంటిన్యూ అవుతుండగానే 4జీ కూడా అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక పరిఙ్ఞానం విస్తృతి పెరిగేకొద్దీ ప్రజలు కూడా దాన్ని వినియోగించుకోడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు 5జీ ఇండియాని ఊపేయబోతోంది.

5జీ ప్రముఖ పాత్ర

5జీ ప్రముఖ పాత్ర

రానున్న కాలంలో ఇండియాలో 5జీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని Department of Telecommunications (DoT) తెలిపింది. టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేందుకు 5జీ రెడీ అవుతోందని డాట్ తెలిపింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అనేక రకాల నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని, ముఖ్యంగా ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అని ఇది ఛాలెంజ్ తో కూడుకున్నదని డాట్ తెలిపింది. రానున్న డిజిటల్ విప్లవం అంతా 5జీ మీద నడుస్తుందని పేర్కొంది.

 socio-economic transformationలో ఎన్నో విజయాలు

socio-economic transformationలో ఎన్నో విజయాలు

మన చేతుల్లో ఇదొక ఆయుధంగా ఉంటుందని కూడా తెలిపింది. socio-economic transformationలో ఎన్నో విజయాలను సాధించేందుకు ఇదొక ఫ్లాట్ పాం అని DoT additional secretary అన్సు ప్రకాష్ industry conferenceలో ధీమా వ్యక్తం చేశారు. 4జీ విప్లవం నుంచి 5జీలోకి రావడం ద్వారా అనేక సంస్థల్లో విప్లవాత్మక మార్పులు సంభవించే అవకాశం ఉందని అన్నారు. health, transportation, agriculture ఇంకా ఇతర రంగాల్లో అనేక మార్పులకు మనం శ్రీకారం చుట్టవచ్చని తెలిపారు.

మొబైల్ ఫోన్లు మరింత వేగం

మొబైల్ ఫోన్లు మరింత వేగం

దీని ద్వారా మనం వాడుతున్న మొబైల్ ఫోన్లు మరింత వేగంగా పనిచేసే అవకాశాలున్నాయంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఈ టెక్నాలజీతో జనం మరింత స్మార్ట్‌గా మారిపోయే అవకాశాలున్నాయట. మన ఊహకు అందని ఎన్నో గొప్ప అనుభవాల్ని ఈ టెక్నాలజీతో చూడబోతున్నామంటున్నారు. అయితే ఇప్పటికే చాల విషయాల్లో స్మార్ట్‌ఫోన్ సహకారం తప్పనిసరి. ఇక 5జీ కూడా అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మరిన్ని మార్పులు కూడా చూసే వీలుందట.

అగ్నిప్రమాదాలు,ట్రాఫిక్ పర్యవేక్షణ

అగ్నిప్రమాదాలు,ట్రాఫిక్ పర్యవేక్షణ

ఇప్పటికే 4జీ టెక్నాలజీ సాయంతో ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నారు . రాబోయే 5జీతో అగ్నిప్రమాదాలు,ట్రాఫిక్ పర్యవేక్షణ వంటివి సులువుగా గుర్తించే వీలుందట. అదేవిధంగా మానవ రహిత వాహనాలు రోడ్లెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.

అనుకున్న పనులన్నీ చకచక

అనుకున్న పనులన్నీ చకచక

మనం ప్రస్తుతం 4జీ టెక్నాలజీ వినియోగిస్తూ సమయానికి నెట్ అందుబాటులో లేకపోవడంతోనో, లేక అనుకున్నంత స్పీడు లేకపోవడంతోనో తీవ్ర అసహనానికి గురవుతాం. అయితే ఈసమస్యకు పరిష్కారంగా 5జీ నిలువనుంది. స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నా, వైఫై స్పీడుకోసం చూస్తున్నా దాని స్పీడు తగ్గిపోయే పరిస్థితి ఏ మాత్రం కనిపించదు. అనుకున్న వీడియో వెంటనే డౌన్‌లోడ్ కావడం లేక ప్లే కావడం ఈజీగా జరిగిపోయే ఛాన్స్ ఉంది.

2020 నాటికి

2020 నాటికి

ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ 5జీ టెక్నాలజీని 2020 నాటికి అంటే మరో ఏడాది కాలంలో అందుబాటులోకి తెచ్చేలా భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. 3జీ,4జీ ప్రారంభంలో ఎదురైన సమస్యల వంటివాటికి చెక్ పెట్టి వీలైనంత త్వరగా ప్రపంచం దేశాలతో సమానంగానే ఈసేవల్ని అందుబాటులోకి తెచ్చేలా క‌ృషిచేస్తోంది భారత ప్రభుత్వం.

Best Mobiles in India

English summary
5G to bring socio-economic transformation in India: DoT

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X