Home
News

5G vs 4G నెట్‌వర్క్‌: యూజర్ డిమాండ్ కాంపిటీషన్ లో పైచేయి ఎవరిది??

ఇండియాలోని టెలికాం సంస్థలు 5G నెట్‌వర్క్‌ ను ఇంకా అధికారికంగా అందుబాటులోకి తీసుకొని రాలేదు. అయితే స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే 5G కనెక్టివిటీ మద్దతు గల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించడం ప్రారంభించారు. 2021లో సరసమైన ధరలో అనేక కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి. భారతదేశంలో 5G నెట్‌వర్క్‌లు లాంచ్ కావడానికి ఇంకా కొంచెం సమయం ఉంది. అయితే టెల్కోలు వెంటనే వినియోగదారులకు 5Gతో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ సేవలను అందిస్తాయా లేదా ఎంటర్‌ప్రైజెస్ కోసం 5G నెట్‌వర్క్‌లను మాత్రమే రిజర్వ్ చేస్తాయా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాబోయే కొన్ని సంవత్సరాలలో 4G నెట్‌వర్క్‌లు ఇప్పటికీ ఆధిపత్య నెట్‌వర్క్ టెక్నాలజీ పాత్రను పోషిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎరిక్సన్ యొక్క 2021 మొబిలిటీ రిపోర్ట్ కనీసం 2027 వరకు భారతదేశంలో 4G ఉంటుందని సూచిస్తుంది.

4G నెట్‌వర్క్‌ అవసరమైన వినియోగదారుల సంఖ్య 51.7%

4G నెట్‌వర్క్‌ అవసరమైన వినియోగదారుల సంఖ్య 51.7%

524 మంది వినియోగదారులతో నిర్వహించిన ఒక సర్వేలో 51.7% మంది వినియోగదారులు 5G నెట్‌వర్క్‌ కంటే 4G నెట్‌వర్క్‌ ని ఇష్టపడుతున్నట్లు తెలిపారు. మిగిలిన 48.3% మంది వినియోగదారులు తమకు ఇప్పుడు 5G అవసరమని తెలిపారు. 5G కోసం ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన వినియోగ సందర్భాలు ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్‌లకు మాత్రమే ఉపయోగపడతాయని సూచిస్తున్నాయి. 4G ఇప్పటికే 50 Mbps కంటే ఎక్కువ స్పీడ్‌ని అందజేస్తున్నట్లయితే 5G నెట్‌వర్క్‌ వినియోగదారులకు నేరుగా ఉపయోగపడదు. ఎందుకంటే ఇది ఖరీదైనది మరియు అనవసరమైనది.

స్మార్ట్‌ఫోన్

ప్రస్తుతం వినియోగదారులకు ఉన్న స్మార్ట్‌ఫోన్ అవసరాలకు 4G సరిపోతుంది. ఇంటర్నెట్-ఆఫ్-థింగ్స్ (IoT) పరికరాల విస్తరణ మరియు మరింత కనెక్ట్ చేయబడిన ప్రపంచంలో 5G ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణ వినియోగదారులకు కనీసం కొంత సమయం వరకు ప్రత్యక్షంగా 5G అవసరం లేదు. 4G నెట్‌వర్క్‌లు ఇప్పుడు 50 Mbps కంటే ఎక్కువ వేగాన్ని అందిస్తే డేటా మరియు వాయిస్ కాలింగ్ అవసరాలకు సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుకు సరిపోతాయి.

5G

సర్వే ఫలితాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి మరియు 5G కోసం మరికొన్ని ఓట్లు ఫలితాన్ని మార్చవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న మిలియన్ల మంది వినియోగదారులు ఇప్పటికే ఉన్నారు. 2022 సమీపిస్తున్న కొద్దీ ఈ సంఖ్యలు పెరుగుతాయని అంచనా. మరింత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రావడంతో ఎక్కువ మంది వ్యక్తులు 5G పరికరాలకు ప్రాప్యతను కోరుకుంటారు.

4G నెట్‌వర్క్ vs 5G నెట్‌వర్క్

4G నెట్‌వర్క్ vs 5G నెట్‌వర్క్

ఇండియాలోని అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు ప్రస్తుతం 4G నెట్‌వర్క్ ను విస్తారంగా కలిగి ఉన్నాయి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో 2G మరియు 3G 4G నెట్‌వర్క్ లను మాత్రమే కలిగి ఉన్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G నెట్‌వర్క్ సాయంతో వినియోగదారులు తమ యొక్క అన్ని రకాల అవసరాలను ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా పూర్తి చేస్తున్నారు. 5G నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే కొద్దిగా డేటా స్పీడ్ పెరగడంతో పాటుగా రీఛార్జ్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. 2G/3G అందుబాటులో ఉన్నప్పుడు గల ధరలతో ప్రస్తుత ధరలను పోలిస్తే కనుక చాలా వ్యతాసం ఉంది.

5G ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లు ఎంత వరకు ఉపయోగకరం

5G ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లు ఎంత వరకు ఉపయోగకరం

ఇండియాలో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంత తక్కువ లేదన్న 6నెలల సమయం పడుతుంది. అంతకు మించి సమయం పట్టిన ఆశ్చర్య పోవలసింది లేదు. ప్రతి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెండు నెలలకు ఒకటి లేదా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అలాగే జనాలు కూడా ప్రతి 6 నెలలు లేదా 9 నెలలకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనడానికి ఇష్టపడుతున్నారు. అంటే మనం ఒక సంవత్సరంకు మించి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం లేదు. కావున ప్రస్తుతం 5G స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఒక్క నెట్‌వర్క్ ఫీచర్ సమస్య తప్ప మిగిలిన అన్ని ఫీచర్లను 4G వోల్ట్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటు ధరలోనే అందిస్తున్నాయి. కావున ఇందులో దేనిని ఎంచుకోవడం అనేది మీ యొక్క ఛాయస్...

More from GizBot

Best Mobiles in India

English summary
5G vs 4G Network: Who Has The Upper Hand in User Demand Competition
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X