అంతుచిక్కని పురాతన ఆవిష్కరణలు
చరిత్రకు అందని పూర్వపు రోజుల్లోనే అద్భుతైన ఆవిష్కరణలతో కూడిన నాగరికత ప్రాచీన ప్రపంచాన్ని శాసించి ఉండొచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పూర్వీకులు తమ అపారమైన మేధోశక్తితో ఊహకందని రీతిలో సృష్టించిన పలు ఆవిష్కరణలకు సంబంధించిన మూలాలను ఇప్పటికి మనం కనుగొనలేక పోతున్నాం. 6 అధునాతన ప్రాచీన ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం...
Read More : మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగం పెంచుకోండిలా..?

అంతుచిక్కని పురాతన ఆవిష్కరణలు
7వ శతాబ్థం నుంచి 12వ శతాబ్థం వరకు మనుగడ సాగించిన బైజాంటైన్లు తమ శత్రువుల పై నౌకా యుద్ధాల్లో భాగంగా ఓ రహస్యమైన పదార్థాన్ని వాడే వారట. ఈ ప్రమాదకర లిక్విడ్‌ను ట్యూబ్స్ ద్వారా అవతలి పడవల పై జిమ్మే వారట. దీంతో ఆ పడవ అగ్నికి ఆహుతై పోయేదట. ఈ కెమికల్ వెపన్‌కు సంబంధించిన ఫార్ములా బైజాంటైన్లతోనే అంతరించి పోయిందని ఓ కథనం.

అంతుచిక్కని పురాతన ఆవిష్కరణలు
14-37 A.D మధ్య ఓ ఫ్లెక్సిబుల్ గ్లాస్ ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందట. ఈ గ్లాస్ ప్రత్యేకత ఎంటంటే క్రిందపడినప్పటికి చెక్కు చెదరదట. అంతుచిక్కని విలువైన లోహాలతో ఈ గ్లాసును అభివృద్థి చేసి ఉండచ్చని చరిత్రకాలు అభిప్రాయపడుతున్నారు.

అంతుచిక్కని పురాతన ఆవిష్కరణలు
ప్రపంచం అవాక్కయ్యేలా అన్ని విషాలకు ఒకే విరుగుడును 120-63 B.C మధ్య కాలంలోనే కనుగొన్నారట. దీని పేరు మిత్రీడేటియమ్. అప్పటి రాజైన Mithridates VI దీన్ని విజయవంతంగా పరీక్షించి చూసారట. అయితే ఈ విరుగుడు సంబంధించిన ఫార్ములా కాల గర్భంలో కలిసిపోయింది.

అంతుచిక్కని పురాతన ఆవిష్కరణలు
గ్రీక్ గణిత మేధావి Archimedes (d. 212 B.C.)లో ఓ హీట్ రే వెపన్ ను అభివృద్థి చేసారట. సూర్యుని కిరణాల సహాయంతో ఈ వెపన్ విడుదల చేసే ప్రమాదకర మైక్రోతరంగాలు శరీరాలను దహించివేయగలవట.

అంతుచిక్కని పురాతన ఆవిష్కరణలు
రోమన్ కాంక్రీట్
కొన్ని రోమన్ వేల సంవత్సరాల నుంచి చెక్కచెదరకుండా ఉన్నాయి. వీటి నిర్మాణంలో ఏఏ పదర్థాలు ఉపయోగించారన్నది నిన్న మొన్నటి వరకు అంతుచిక్కని రహస్యంలానే నిలిచింది. ఈ చారిత్రాత్మక కట్టడాల నిర్మాణంలో భాగంగా అగ్నిపర్వత బూడిదని ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

అంతుచిక్కని పురాతన ఆవిష్కరణలు
డమాస్కస్ స్టీల్
నానో టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు మనం అభివృద్థి చేసుకుంటోన్న డమాస్కస్ స్టీల్, రోమన్ చక్రవర్తుల కాలంలోనే తన హవాను కొనసాగించిందట. ఈ శక్తివంతమైన స్టీల్‌తో వారు కత్తులను తయారు చేయించుకునే వారట.


Click it and Unblock the Notifications








