రూ.5 చెల్లిస్తే రూ.50 టాక్‌టైమ్

దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ టెలికం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. 'Yaari Dosti Recharge' పేరుతో ఈ ఐడియా లాంచ్ చేసిన లిమిటెడ్ పరియడ్ ప్లాన్‌లో భాగంగా రూ.5 చెల్లిస్తే రూ.50 టాక్‌టైమ్ లభిస్తుంది. ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఇలా చేయండి...

Read More : రూ.10,000లోపే, బ్రాండెడ్ ఫోన్‌ల పై బంపర్ ఆఫర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా మీ ఐడియా ప్రీపెయిడ్ నెంబర్ నుంచి *563*5# నెంబర్‌కు డయల్ చేయండి.

స్టెప్ 2

పైన పేర్కొన్న యూఎస్ఎస్‌డి కోడ్‌కు డయల్ చేసిన వెంటనే మీ ఫోన్ స్ర్కీన్ పై ఓ పాప్-అప్ ప్రత్యక్షమవుతుంది. ఆ మెనూలోని 'OK'బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

ఇప్పుడు "Final Confirmation : Paayein Rs 50 Ka Muft Recharge !! Subscribe Kijiye Cricket pack @ Rs 5/day press 9 to Activate." పేరుతో ఓ మెసేజ్ మీకు అందుతుంది.

స్టెప్ 4

9 బటన్ పై క్లిక్ చేసిన వెంటనే రూ.5 బ్యాలన్స్ మీ మెయిన్ బ్యాలన్స్ నుంచి కట్ అవుతుంది. మీ ఐడియా నెంబర్‌కు సర్వీస్ యాక్టివేట్ అయినట్లు ఓ ప్యాక్ యాక్టవేషన్ మేసెజ్ మీ ఫోన్‌కు అందుతుంది.

మీరు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు..

- ఈ ఆఫర్ ఒక్కో యూజర్‌కు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది.
- ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
- పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Easy Steps to Receive Rs. 50 Talktime for Just Rs.5 on Idea. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot