కుప్పకూలుతున్న విండోస్ ఫోన్‌ మార్కెట్ షేర్..?

Written By:

ఫేలవమైన అమ్మకాలు, తీవ్రమైన పోటీ మార్కెట్ కారణంగా విండోస్ ఫోన్‌‌ల మార్కెట్ షేర్ రోజురోజుకు దిగజారుతున్నట్లు తెలుస్తోంది. డెస్క్‌టాప్ కంప్యటింగ్ మార్కెట్లో రారాజుగా కొనసాగుతోన్న మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై పట్టు సాధించే క్రమంలో 7.2 బిలియన్లు వెచ్చించి నోకియాను కొనుగోలు చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. విండోస్ ఫోన్ వ్యాపారంలో మైక్రోసాఫ్ట్ డీలా పడటానికి ముఖ్యమైన కారణాలు...

Read More : గూగుల్ సెకనుకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడవ క్వార్టర్‌లో

కుప్పకూలుతున్న విండోస్ ఫోన్‌ మార్కెట్ షేర్..?

మూడవ క్వార్టర్‌లో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ కేవలం 2.3 మిలియన్ల లుమియా డివైస్‌లను మాత్రమే విక్రయించగా, రెండవ త్రైమాసికంలో లుమియా ఫోన్‌ల అమ్మకాలు 4.5 మిలియన్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో యాపిల్, 2015 చివరి క్వార్టర్‌లో 75 మిలియన్ల ఐఫోన్‌లను విక్రయించగలిగింది.

గతేడాదితో పోలిస్తే...

కుప్పకూలుతున్న విండోస్ ఫోన్‌ మార్కెట్ షేర్..?

గతేడాది ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ 8.6 మిలియన్ లుమియా ఫోన్‌లతో పాటు 24.7 మిలియన్ ఇతర ఫోన్‌లను విక్రయించగలిగింది.

కలవరపెడుతోన్న గణాంకాలు

కుప్పకూలుతున్న విండోస్ ఫోన్‌ మార్కెట్ షేర్..?

ఒక్క ఏడాదిలో విండోస్ ఫోన్ సేల్స్ 73శాతానికి పడిపోవటం మైక్రోసాఫ్ట్‌ను కలవరపెడుతోంది.

ఆదాయం తగ్గుముఖం

కుప్పకూలుతున్న విండోస్ ఫోన్‌ మార్కెట్ షేర్..?

విండోస్ ఫోన్‌ల ద్వారా మైక్రోసాఫ్ట్‌కు వచ్చే రివెన్యూ 46శాతానికి తగ్డింది.

బ్లూమ్‌బర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం

కుప్పకూలుతున్న విండోస్ ఫోన్‌ మార్కెట్ షేర్..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి 100 స్మార్ట్‌ఫోన్‌లలో కేవలం రెండు ఫోన్‌లు మాత్రమే విండోస్ సాఫ్ట్‌‍వేర్ పై రన్ అవుతున్నాయి.

గార్టనర్ డేటా ప్రకారం

కుప్పకూలుతున్న విండోస్ ఫోన్‌ మార్కెట్ షేర్..?

ఫిబ్రవరి 2016లో, గార్టనర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం విండోస్ ఫోన్ మార్కెట్ షేర్ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 1శాతానికి తగ్గింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 reasons why Microsoft Windows phone is dying. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting