టెక్ ప్రపంచంలోని డబ్బంతా వీరి దగ్గరే ఉంది..

Written By:

ఫోర్బ్స్ టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న వారి జాబితాను ప్రకటించింది. ఎంతో మంది టెక్ బిలియనీర్లు తమ ఆదాయన్ని ఏటా పెంచుకుంటూ పోతున్నారని ఈ మ్యాగజైన్ తెలిపింది. టెక్ ప్రపంచాన్ని కొంతమంది మాత్రమే తమ చేతుల్లోకి తీసుకున్నారని వారి చేతుల్లోనే సంపదంతా ఉందని తెలిపింది. మరి ఆ బిలియనీర్లపై ఓ లుక్కేద్దామా..

భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ అధినేత. అతని ఆస్తుల నికర విలువ 78 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. సంపదను ఎంతగా దానం చేసినప్పటికీ అతని సంపద తరగడం లేదు. ఇంకా ఎక్కువవుతూనే ఉంది. గేట్స్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

జెఫ్ బిజోస్

అమెజాన్ సీఈఓ. అత్యంత బిలియనీర్ జాబితాలో బిల్ గేట్స్ ను పక్కకు నెట్టేసి మొదటి స్థానానికి వచ్చారనే వార్తలు కూడా ఈ మధ్య సందడి చేశాయి. దాదాపు 90.9 బిలియన్ డాలర్లతో గేట్స్ ను మించిపోయాడు కూడా. అయితే అమెజాన్ షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో వెంటనే ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఇతని నికర ఆస్తుల విలువ 66.2 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

మార్క్ జుకర్ బర్గ్

ప్రపంచాన్ని ఏలుతున్న సోషల్ మీడియా ఫేస్ బుక్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇతని నికర ఆస్తుల విలువ 54 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

ల్యారీ ఎల్లిసన్

ఒరాకిల్ కో ఫౌండర్.ఇతని నికర ఆస్తుల విలువ 51.7 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఫోర్బ్స్ జాబితాలో ఎప్పటినుంచో అత్యంత ధనవంతుల జాబితాలో నిలుస్తూ వస్తున్నారు.

ల్యారీ పేజ్

గూగుల్ కో ఫౌండర్. ఆల్ఫాబీట్ Inc సీఈఓ కూడా. ఇతని నికర ఆస్తుల విలువ 39 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

సెర్జీ బ్రిన్

ప్రస్తుతం ఆల్పాబీట్ అధ్యక్షుడు. ఇతని నికర ఆస్తుల విలువ 38.2 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Richest Tech Billionaires in the World Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot