టెక్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదగాలనుకునేవారికి 6 విజయ రహస్యాలు

Posted By: BOMMU SIVANJANEYULU

అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు భవిష్యత్ పై పెను ప్రభావం చూపుతోంది. వేగంగా విస్తరిస్తోన్న మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీ, మార్కెట్లో కొత్త ఉద్యోగాలను సృష్టించటంతో పాటు సేల్స్ ఇంకా కస్టమర్ సర్వీసును కూడా మెరుగుపరుస్తోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో చోటుచేసుకుంటోన్న టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్‌తో పాటు వర్చువల్ రియాల్టీ, మెచీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్ వంటి అంశాలు టెక్ ప్రొఫెషనల్స్‌కు మరిన్ని ఆప్షన్స్‌ను కల్పించటంతో పాటు వారి పై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయిపోటీ ప్రపంచంలో రాణించాలనుకునే టెక్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రస్తుత తరుణంలో మరిన్ని కొత్త కోర్సుల పై అవగాహన పెంచుకోవల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకున్న పోటీ పరిస్థితుల నేపథ్యంలో టెక్ ఎగ్జిక్యూటివ్‌గా ఎదగాలనుకునేవారికి ఫోర్బ్స్ టెక్నాలజీ కౌన్సిల్ 6 విజయ రహస్యాలను సూచించింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Gadfly యాప్‌లో నేతల పూర్తి వివరాలు,సమస్యలపై వారిని ప్రశ్నించండి ఇక !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఖచ్చితమైన ఫలితాల కోసం పనిచేయాలి..

ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచానికి అనుగుణంగా ఎదగాలనుకునే టెక్ ఎగ్జిక్యూటివ్‌లు ఖచ్చితమైన ఫలితాలను అందించే విధంగా టెక్నాలజీని మౌల్డ్ చేసుకోవాలని ఫోర్బ్స్ టెక్నాలజీ కౌన్సిల్ సభ్యుల్లో ఒకరైన టీసీజీ ఇంక్‌ డేవ్ కేసిడీ సూచించారు.

ఇన్నోవేషన్‌కు పెద్దపీట వేయండి..

ఇంటర్నెట్ అలానే సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల ద్వారా నిరంతరం కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవటం ద్వారా టెక్ ఎగ్జిక్యూటివ్‌లు పూర్తిస్థాయిలో రాణించగలుగుతారని ఫోర్బ్స్ టెక్నాలజీ కౌన్సిల్ సభ్యుల్లో ఒకరైన అరిజెంట్ ఇంక్‌ అభిజిత్ తటే తెలిపారు. ఈ విధమైన ఇకోసిస్టంను క్రియేట్ చేసుకోవటం ద్వారా వీరు తమ ఇన్నోవేషన్‌ను మరింతగా యాక్సిలరేట్ చేసుకునే వీలుంటుందని ఆయన తెలిపారు.

 

 

మీపై నమ్మకం ఉంచి ప్రపంచమే హద్దుగా దూసుకోపోండి..

పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఎదగాలనుకునే టెక్ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఆశయాలు ఆలోచనల పై నమ్మకం ఉంచి గ్లోబల్ ఆలోచనలతోతో ముందుకు వెళ్లాలని ఫోర్బ్స్ టెక్నాలజీ కౌన్సిల్ సభ్యుల్లో ఒకరైన చార్ట్ బూస్ట్ మరియా అలెగ్రే సూచించారు.

అనుభవజ్ఞులతో కూడిన టీమ్ కావాలి...

టెక్నాలజీ ప్రపంచంలో రాణించాలనుకునే సంస్థలు అనుభవజ్ఞులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసుకోవటం ద్వారా ఆరోగ్యకరమైన పనివాతవరణాన్ని ఏర్పాటు చేసుకోవటంతో పాటు శక్తివంతమైన వ్యవస్థగా రూపాంతరం చెందే అవకాశముందని ఫోర్బ్స్ టెక్నాలజీ కౌన్సిల్ సభ్యుల్లో ఒకరైన డ్రైవ్ స్కేల్ జీన్ బన్మాన్ సూచించారు.

ఆలోచనల విషయంలో దూకుడు అవసరం

టెక్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆలోచనల విషయంలో దూకుడు, అప్లికేషన్స్ విషయంలో క్రియేటివిటీ అనేది ఎంతో అవసరమని ఫోర్బ్స్ టెక్నాలజీ కౌన్సిల్ సభ్యుల్లో ఒకరైన ఐటీఎస్ లాజిస్టిక్స్‌ డేవిడ్ ఎస్పినోసా యువ టెక్ ఎగ్జిక్యూటివ్‌లకు సూచించారు. సిస్టమ్స్ అలానే ఇన్ ఫ్రాస్ట్రక్షర్‌ను సెక్యూర్‌గా ఉంచటమనేది టెక్ ఎగ్జిక్యూటివ్‌లకు ఓ బేసిక్ రిక్వైర్మెంట్ మాత్రమేనని వీటితో పాటు వారికంటూ క్రియేటివిటీ అలానే ఐడియాలజీలు తప్పనిసరిగా ఉండాలని ఆయన తెలిపారు.

 

 

ప్రొడక్ట్స్ కాదు ప్లాట్‌ఫామ్స్ కొనాలి...

టెక్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రొడక్ట్స్ కొనుగోలు పై కాకుండా ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు పై ఆలోచన చేయాలని ఫోర్బ్స్ టెక్నాలజీ కౌన్సిల్ సభ్యుల్లో ఒకరైన మెచీన్‌మెట్రిక్స్ ఇంక్‌ ఎరిక్ ఫాగ్ టెక్‌ ఎగ్జిక్యూటివ్‌లకు సూచించారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Six members of Forbes Technology Council weigh in on the most important thing that technology executives need to be doing differently today to equip themselves and their business for success. Here is what they recommend.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot