ఈ చిట్కాలు పాటిస్తే చిన్న పిల్లలు ఫోన్ దగ్గరికే రారు

By Gizbot Bureau
|

2017 జూలై 4న The Indian Express పేజీలో షాకింగ్ headlineతో ఇండియా నిద్ర లేచింది. అదేంటంటే ఫోన్ ఇవ్వలేదని 9 ఏళ్ల బాలుడు కత్తితో తన చేయి కోసుకున్నాడని. చిన్న పిల్లలు ఫోన్లకు ఎలా అడిక్ట్ అవుతున్నారో ఈ ఒక్క ఉదంతంతో దేశం మొత్తానికి తెలిసింది. పెద్దవాళ్లే ఫోన్లకు అంతగా అడిక్ట్ అవుతున్న ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అవడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు.

6 Tips to Keep Smartphones Away from Young Children

తర్వాత జరిగే పరిణామాలు చూస్తేనే చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి తట్టుకోలేని శోకం మిగలవచ్చు. కాబట్టి వీలయినంతవరకు పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాల్సి ఉంటుంది. పెద్దవాళ్లు ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఉంటే పిల్లలు కూడా కొంచెం దూరంగా ఉంటారు. ఒకవేళ పిల్లలు అడిక్ట్ అయితే ఈ కింది పద్దతుల ద్వారా వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి.

 Keep your child engaged

Keep your child engaged

చిన్న పిల్లలని వీలయినంత వరకు ఫోన్లకు దూరంగా ఉంచాలంటే వారిని టాయ్స్ తో ఆడుకునే విధంగా తయారుచేయాలి. పక్క ఇంట్లో ఉండే చిన్న పిల్లలతో కలిసి ఆడుకునే విధంగా మోటివేట్ చేయాలి. ప్లే గ్రౌండ్ వైపు ఎక్కువగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎంటర్ టైన్ మెంట్ గాడ్జెట్లకు వీలయినంత దూరంగా ఉంచాలి.

Restrict the use

Restrict the use

స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగం అయిపోయాయి కాబట్టి పిల్లలు కూడా వాటికి బానిసలుగా మారుతున్నారు. అయితే వాటిని అంత తేలికగా మరచిపోలేరు కాబట్టి వీలయినంత తక్కువ టైం దానితో ఆడుకునేలా ప్లాన్ చేయాలి. స్టడీ అవర్స్, అలాగే మీల్స్ టైం, స్లీపింగ్ టైంలో ఫోన్లకు దూరంగా ఉంచాలి.

Talk to your child
 

Talk to your child

పిల్లలతో పెద్దలు ఒక్కోసారి సరిగా మాట్లాడకపోవడం వల్ల కూడా వారు ఫోన్లకు బానిసలుగా మారే అవకాశం ఉంది. పెద్దలు ఫోన్లకు అడిక్ట్ కాకుండా వీలైనంత ఎక్కువగా పిల్లలతో గడపాలి. అప్పుడు వారు ఫోన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వారికి వివరించడం వల్ల వారు కొంచెం తెలుసుకుంటారు. వీడియోలు చూడటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను చార్ట్ రూపంలో వారికి వివరించాలి.

Set passwords

Set passwords

ఫోన్ పాస్ వర్డ్ లను గట్టిగా ఉంచాలి. వారికి తెలిస్తే వెంటనే ఓపెన్ చేసేస్తారు. అలా కాకుండా కొంచెం క్లిష్టమైన పాస్ వర్డ్ లను ఇస్తే వారు చాలా వాటిని ఓపెన్ చేయలేరు. ఫోన్లను వారికి దూరంగా ఉంచాలి లేదంటే చాలా క్లిష్టమైన పాస్ వర్డ్ లను ప్రవేశపెట్టుకోవాలి. అప్పుడే కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.

Set a good example

Set a good example

మీరు ఫోన్లకు అడిక్ట్ కావడం వల్ల వారు అలా తయారవుతున్నారు. మీరు ఫోన్లను వదిలేసి వారితో ఎక్కువ సమయం గడిపితే వారు ఫోన్లకు దూరం అవుతారు. కాబట్టి మీరు వారికి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేయాలి. మీరు వారికి ఉదాహరణగా నిలిస్తే వారు కూడా చదువు మీద తమ దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది.

 Bond with your child

Bond with your child

ఈ రోజుల్లో జీవితం అంతా ఉరుకుల పరుగుల మీదనే సాగుతోంది. పొద్దున లేస్తే ఆఫీసు, వ్యాపారం తో తలమునకలవుతుంటాం. అలాంటి సమయంలో పిల్లలతో కలిసి ఉండే సమయం ఎవరకీ ఉండదు. ఈ ప్రభావం కూడా పిల్లల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు పిల్లలతో చిన్ని చిన్న ఆటలు ఆడే ప్రయత్నం చేయాలి. క్యారంబోర్డ్, అలాగే ఇతర రకాల చిన్న చిన్న గేమ్ లను వారితో కలిసి ఆడటం వల్ల కూడా వారు చాలా సంతోషంగా ఉంటారు.

Best Mobiles in India

English summary
6 Tips to Keep Smartphones Away from Young Children

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X