ATM దొంగతనాలు ఎలా జరుగుతున్నాయ్..?

భారతదేశపు బ్యాంకింగ్ చరిత్రలోనే మాయని మచ్చలా నిలుస్తూ 19 బ్యాంకులకు సంబంధించి 62 లక్షల డెబిట్ కార్డులు గతేడాది హ్యాక్ అయిన విషయం తెలిసిందే. హ్యాకర్ల దశ్చర్యతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులకు సంబంధించి కస్టమర్‌లు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు.

Read More : మొబైల్ టవర్స్ సమాచారం ఇక మీ చేతిలో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నివ్వెరపోయే వాస్తవాలు..

ఈ ఘటన పై సాగించిన దర్యాప్తులో భాగంగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ముందుగా హ్యాకర్లు హిమాచల్ ప్రదేశ్‌లోని ఎస్ బ్యాంక్ ATMలోకి ఓ malwareను ప్రవేశపెట్టారు.

దేశం మొత్తం వైరస్ వ్యాంపించేసింది...

ఆ మాల్వేర్ సంబంధింత ఏటీఎమ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని ఏటీఎమ్ కార్డ్స్ ద్వారా ఆ వైరస్‌ను ఇతర బ్యాంకులకు సంబంధించి ATMలకు వ్యాపింపజేసింది. అలా.. అలా దేశం మొత్తం సమస్య వ్యాపించేసింది. ATMలను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ఉపయోగించే మార్గాలను ఇప్పుడు తెలుసుకుని, మరింత అప్రమత్తంగా ఉందాం..

మీ ఫోన్‌లో జియో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా..?

కార్డ్ రీడర్ స్లాట్‌లో ప్రత్యేకమైన డివైస్‌లను ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ..

ATM కార్డ్ రీడర్ స్లాట్‌లో ప్రత్యేకమైన డివైస్‌లను ఇన్‌స్టాల్ చేయటం ద్వారా హ్యాకర్లు ఏటీఎమ్ కార్డులను హ్యాక్ చేయగలుగుతున్నారు. నగతు విత్ డ్రా చేసుకునే సమయంలో మన డెబిట్ కార్డును ATM కార్డ్ రీడర్ స్లాట్‌లో ఇన్సర్ట్ చేయవల్సి ఉంటుంది.

magnetic strip భాగంలో ఉండే రహస్య డేటా..

ఈ సమయంలో మన కార్డుకు సంబంధించి magnetic strip భాగంలో ఉండే రహస్య డేటాను హ్యాకర్ల అమర్చిన ప్రత్యేక డివైస్ డీకోడ్ చేసి వాళ్లకు చేరవేస్తుంది. తద్వారా వాళ్లు నకిలీ కార్డులను సృష్టించి హ్యాకింగ్ కు పాల్పడగలరు. కాబట్టి, మీ డెబిట్ కార్డును ATM కార్డ్ రీడర్ స్లాట్‌లో ఇన్సర్ట్ చేసినపుడు ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి.

మీ ఫోన్‌‌‌లో వాట్సాప్ ఫోటోలు ఎక్కువైపోతున్నాయా..?

మరో ఎత్తుగడ...

హ్యాకర్లు మిమ్మిల్ని బురిడీ కొట్టించే క్రమంలో కార్డ్ రీడర్ స్లాట్‌ ముందు మరొక స్లాట్‌ను కూడా ఫిట్ చేస్తారు. మీరు ఈ స్లాట్‌లో కార్డును ఇన్సర్ట్ చేసిన వెంటనే ఆ కార్డును డివైస్ లోపలికి లాగేసుకుంటుంది. దీంతో మీరు ATM మెచీన్లో కార్డులో ఇరుక్కుపోయిందని అనుకుంటారు. మీరు అలా వెళ్లిన వెంటనే వీళ్లు ఆ డివైస్ లోపలి నుంచి కార్డును తీసేస్తారు.

నకిలీ ATM మెచీన్లు కూడా ఉంటాయి..

హ్యాకర్లు మిమ్మిల్ని బురిడీ కొట్టించే క్రమంలో నకిలీ ATM మెచీన్లను కూడా ఏర్పాటు చేసే అవకాశముంది. వీటిలో గనుక మీరు నగదు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినట్లయితే కార్డు పిన్ తో పాటు నగదును కూడా కోల్పోవల్సి వస్తుంది.

మీ పెన్‌డ్రైవ్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవటం ఎలా..?

కీప్యాడ్ మార్చేస్తారు..

మరోఎత్తుగడలో భాగంగా హ్యాకర్లు పిన్ ఎంటర్ చేసేందుకు ఉపయోగించే ఒరిజినల్ కీప్యాడ్ పైన నకిలీ కీప్యాడ్‌ను ఉంచుతారు. ఇటువంటి కీప్యాడ్‌ల పై పిన్‌ను ఎంటర్ చేసినట్లయితే మీ పిన్ నెంబర్ గల్లంతే..

పిన్ హోల్ కెమెరాల ద్వారా..

మరోవ్యూహంలో భాగంగా హ్యాకర్లు ATM మెచీన్లలో పిన్ హోల్ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇవీ మీరు ఎంటర్ చేసే పిన్ నెంబర్‌ను మీకు తెలియకుండానే క్యాప్చుర్ చేసేస్తుంటాయి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఎలా..?

ఎనీ టైమ్ మనీ..

'ఎనీ టైమ్ మనీ' అని మనం ముద్గుగా పిలుచుకునే ATM అసలు పేరు ఆటోమెటెడ్ టెల్లర్ మిషిన్. బ్యాంకింగ్ రంగంలో ఏటీఎం కేంద్రాలు ఓ విప్లవం అని చెప్పుకోవాలి. ATM మెచీన్లు అందుబాటులోకి రాకముందు గంటల తరబడి బ్యాంకుల్లో వేచి ఉండి డబ్బులు డ్రా చేసుకోవల్సిన పరిస్థితి. అది కూడా బ్యాంక్ వర్కింగ్ అవర్స్‌లోనే.

మన దేశంలో మొదటి ఏటిఎం ఎప్పుడు..?

మన దేశంలో మొదటి సారిగా ఏటిఎంను ప్రారంభించింది హంగ్ కాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పోరేషన్. 1987లో ముంబాయిలో HSBC బ్యాంక్ ఎటీఎమ్ మెచీన్‌ను దుబాటులోకి తెచ్చింది. ఆ తరువాత అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల కూడా ఏటిఎంను ప్రారంభించాయి.

గుర్తు తెలియని మొబైల్ నెంబర్స్ విసిగిస్తున్నాయా..?

ఏటీఎమ్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు..

మనలో చాలా మంది ఇప్పటికి ఏటీఎమ్ కార్డులను నగదు తీసుకోవడానికో లేదా అకౌంట్లో బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఏటీఎమ్ మెషీన్స్ ద్వారా రకకరాల సేవలు అందుబాటులో ఉన్నాయి. క్యాస్ విత్ డ్రాల్, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లింపు, యుటిలిటీ బిల్స్ చెల్లింపు, మొబైల్ రీఛార్జింగ్, టికెట్ బుకింగ్, ఈఎమ్ఐ చెల్లింపు, ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఫిక్సుడ్ డిపాజిట్స్, లోన్ అకౌంట్ చెల్లింపు ఇలా అనేక రకాల సేవలను ఏటీఎమ్ మెషీన్స్ ద్వారా పొందవచ్చు.

రిసిప్ట్‌ను అక్కడే నలిపి పాడేస్తుంటారు...

సాధారణంగా ఏటీఎమ్‌లో డబ్బు డ్రా చేయగానే మనకో రిసిప్ట్ వస్తుంది. మనలో చాలా మంది ఈ రిసిప్ట్‌ను అక్కడే నలిపేసి పాడేస్తుంటారు. నిర్లక్ష్యంతో మనం వదిలివేసే రిసిప్ట్ సైబర్ నేరాలకు కారణం కాగలదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. మనం పారేసిన ఏటీఎమ్ రిసిప్ట్ వివరాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు మన అకౌంట్‌లలోకి చొరబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

టెక్నికల్ లోపాలు తలెత్తుతంటుటాయి...

కొన్ని కొన్ని సందర్భాల్లో ATM నుంచి నగడు డ్రా చేస్తున్నపుడు టెక్నికల్ లోపాలు తలెత్తుతంటుటాయి. నగదు మన చేతికి రాకుండానే అకౌంట్‌లో డబ్బు కట్ అయినట్లు చూపిస్తుంది. ఇటువంటి సమయంలో ATM రిసిప్ట్ ఆధారంగానే బ్యాంకు లో మీ కంప్లెయింట్ ఫైల్ చేయబడుతుంది.

మీకు తెలుసా.. మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతుంది

ATM కార్డ్ తాలూకా రిసిప్ట్‌లను బయట పాడేయకండి.

నిర్లక్ష్యంతో మీరు వదిలిపారేసే రిసిప్ట్ ద్వారా దొంగతనాలు జరిగే అవకాశముంది. ఎందుకంటే మీరు వదిలేసిన రిసిప్ట్ మీ అకౌంట్ లో మిగిలి ఉన్న నగదుకు సంబంధించి అన్ని వివరాలు  ఉంటాయి. మళ్లీ మీరు అదే ATM సెంటర్ కు వచ్చినప్పుడు మిమ్మల్ని బెదిరించే మీ సొమ్మును దోచుకునే పరిస్థితులు కూడా రావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ATM కార్డ్ తాలూకా రిసిప్ట్‌లను బయట పాడేయకండి.

ATM పిన్ నెంబర్‌లకు సంబంధించి

ATM పిన్ నెంబర్‌లకు సంబంధించి ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే నివ్వెరపోయే వాస్తవాలను బహిర్గతం చేసింది. ఓ అంతర్జాతీయ మీడియలో వచ్చిన కధనం ప్రకారం 10,000 రకాల నాలుగు అంకెల పిన్ నెంబర్లలో 11 శాతం పిన్ నెంబర్లను హ్యాకర్లు సలువుగా పసిగట్టవచ్చట.

ఈ పిన్ నెంబర్లకు దూరంగా ఉండండి..

ఈ అధ్యయనంలో భాగంగా ప్రముఖ సంస్థ డేటా జెనిటిక్స్ 3.2 మిలియన్ పాస్‌వర్డ్‌లను విశ్లేషించింది. హ్యాకర్లు సులువుగా పసిగట్టగలిగే ATM పిన్ నెంబర్స్ ను ఇక్కడ సూచించటం జరుగుతోంది. ఈ పిన్ నెంబర్లకు మీరు దూరంగా ఉండటం మంచిది. 2001, 1010, 8888, 4321, 1122, 1313, 5555, 6666, 9999, 3333, 2222, 6969, 2000, 4444, 7777, 1004, 0000, 1212

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Tricks Criminals Use To Hack Into Bank ATM. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot