టెక్నాలజీ రాకతో పూర్తిగా మారిపోయిన వర్క్ కల్చర్
టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వర్క్ ప్లేసెస్‌కు సంబంధించిన రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి.
టెక్నాలజీ విభాగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వర్క్ ప్లేసెస్‌కు సంబంధించిన రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈమెయిల్స్ ద్వారానే ఉద్యోగ లావాదేవీలు జరుగుతున్నాయి. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్స్ ఇంకా ప్రెజంటేషన్స్ ఆఫీస్ ప్రొడక్టివిటీని ఒక్కసారిగా పెంచేసాయి. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ డేటా బేసెస్ ఆఫీస్ రికార్డులను భద్రంగా దాచిపెడుతున్నాయి.

మనుషుల స్థానంలో రోబోట్స్..
ఇదే సమయంలో రోబోట్స్ అలానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనుషులతో పనిలేకుండా వస్తువులను తయారు చేసేస్తున్నాయి. వేగంగా విస్తరిస్తోన్న టెక్నాలజీ కారణంగా పనివాతారణం ఇలా అనేక రకాలుగా అభివృద్థి చెందుతూ వస్తోంది. వర్క్ ప్లేసెస్‌లో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితాల పై కూడా టెక్నాలజీ పెను ప్రభావం చూపుతూ వస్తోంది. టెక్నాలజీ రాకతో వర్క్ కల్చర్‌లో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులను ఇప్పుడు తెలుుసకుందాం..

కమ్యూనికేషన్ టెక్నాలజీస్..
అందుబాటులోకి వచ్చిన ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫ్యాక్స్ మెచీన్స్, సర్‌ఫేస్ మెయిల్స్, టెలిఫోన్ వంటి వాటిని పూర్తి భర్తీ చేసింది. వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చిన ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ వంటి చాటింగ్ సాఫ్ట్‌వేర్ సాధనాలు కమ్యూనికేషన్‌ను మరింత వేగంగా యాక్సిస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఆఫీస్ ప్రొడక్టివిటీ
వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్స్, డిజిటల్ ప్రెజంటేషన్స్ అనేవి రోజువారి జీవితంలో కామన్‌గా మారిపోయాయి. వీటిని ఆఫీస్ అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకు కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఆఫీస్ ప్రొడక్టివిటీ టూల్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత వ్యక్తిగత డేటాను కూడా సలువుగా ఆర్గనైజ్ చేసుకోగులుగుతున్నాం.

రికార్డ్ కీపింగ్ అండ్ రిట్రీవల్
చాలా వరకు వ్యాపార సంస్థలు తమతమ రికార్డులను పేపర్ ఫైల్స్‌ను ఎలక్ట్రానిక్ డేటాబెసెస్‌కు మార్చేస్తున్నాయి. దీంతో వారి డేటా మరింత భద్రంగా ఉంటుంది.

ఇంటర్నెట్ అండ్ సెర్చ్
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన ప్రపంచం మొత్తాన్ని తరువాత గూగుల్, బింగ్ వంటి సెర్చ్ ఇంజిన్స్ విస్తృతంగా వినియోగించబడుతున్నాయి. ఈ ఇంజిన్స్‌ను ఆఫీస్ అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాలకు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు.

డీసెంట్రలైజిడ్ వర్క్..
అందుబాటులోకి వచ్చిన ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ ఇంకా స్మార్ట్‌ఫోన్స్ వర్క్ కల్చర్‌ను మరింత పోర్టబుల్ చేసేస్తున్నాయి. దీంతో ఫ్రీలాన్సింగ్, వర్-ఆన్ డిమాండ్, వర్క్-ఫ్రమ్-హోమ్ వంటి ఫ్లెక్సిబుల్ వర్క్స్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications








