వాట్సాప్‌లో ఏకాంతతను కోరుకుంటున్నారా..?

Posted By:

స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా వినియోగించుకుంటోన్న కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత వినియోగదారుల సంఖ్య మరింత పెరిగింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఉచిత చాటింగ్ అప్లికేషన్‌ను అత్యాధునిక హంగులతో ఉపయోగించుకుంటున్నారు.

Read More: వాట్సాప్ గురించి మీకు తెలియని 9 నిజాలు

వాట్సాప్ ఇప్పుడు కొత్త మెటీరియల్ డిజైనింగ్‌తో మరింత లైవ్లీగా కనిపిస్తోంది. బ్లూటిక్స్, వాయిస్ కాలింగ్ వంటి సరికొత్త ఫీచర్లు ఇటీవల అతనంగా జతయ్యాయి. వాట్సాప్, 100 కోట్ల డౌన్‌లోడ్‌లతో మెయిన్‌స్ట్రీమ్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీస్‌గా అవతరించినప్పటికి, ఈ యాప్ అందిస్తోన్న ప్రైవసీ పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై డెవలపర్లు దృష్టిసారించాల్సి ఉంది. భవిష్యత్ లోనైనా వాట్సాప్ , ఈ క్రింది స్లైడ్‌షోలో చర్చించుకోబోయే 6 ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుందని ఆశిద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్‌లో ఏకాంతంగా గడపాలనుకుంటున్నారా..?

ఇన్-బుల్ట్ యాప్ లాక్

వాట్సాప్‌లో ఇన్-బుల్ట్‌గా ఈ యాప్ అందుబాటులోకి వచ్చినట్లయితే మన వాట్సాప్ అకౌంట్‌లోని వ్యక్తిగత డేటాకు పూర్తిస్థాయిలో సెక్యూరిటీని కల్పించవచ్చు. ఈ తరహా మెకనిజంతో థర్డ్ పార్టీ యాప్స్ ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతున్నప్పటికి అవి ఎంత వరకు శ్రేయస్కరం..?

 

వాట్సాప్‌లో ఏకాంతంగా గడపాలనుకుంటున్నారా..?

ఇన్విజిబుల్ మోడ్

అదృశ్య మోడ్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టడం వల్ల యూజర్లకు మరింత ప్రైవసీ లభిస్తుంది. అయితే, ఈ ఫీచర్ పై వాట్సాప్ అంతగా ఆసక్తి కనబర్చటం లేదనేది ఓ వాదన.

 

వాట్సాప్‌లో ఏకాంతంగా గడపాలనుకుంటున్నారా..?

బిజీ మోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా వాట్సాప్ యూజర్లు మరింత సౌకర్యవంతంగా ఫీలయ్యే అవకాశముంది. యూజర్లు ముఖ్యమైన పనిలో నిమగ్నమైనపడు బిజీ మోడ్ ను యాక్టివేట్ చేయటం ద్వారా వేరొకరు వారిని ఇబ్బంది పెట్టేందుకు ఆస్కారం ఉండదు.

 

వాట్సాప్‌లో ఏకాంతంగా గడపాలనుకుంటున్నారా..?

వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత డెవలపర్లు వాట్సాప్‌లో ఫ్రెండ్ రిక్వస్ట్ ఫీచర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే, వాట్సాప్‌లో గుర్తుతెలియని కాంటాక్ట్‌ను బ్లాక్‌చేసే అవకాశముంది.

 

వాట్సాప్‌లో ఏకాంతంగా గడపాలనుకుంటున్నారా..?

రీకాల్ మెసేజ్:

ఒక్కోసారి ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి పంపించివేస్తుంటాం. అయితే ఆ మెసేజ్ వెనుక్కు తీసేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తే బాగుటుంది.

 

వాట్సాప్‌లో ఏకాంతంగా గడపాలనుకుంటున్నారా..?

సాధారణంగా ప్రతిఒక్కరి వాట్సాప్ అకౌంట్‌లో రకరకాల కాంటాక్ట్‌లు ఉంటాయి. వాటిలో ఎంపిక చేసిన కాంటాక్ట్‌లకు కేవలం టెక్స్ట్ సందేశాలను మాత్రమే పంపుకునేందుకు వీలుగా Text only messages ఆప్షన్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటందని పలువురు యూజర్లు అభిప్రాయ పడుతున్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 WhatsApp privacy features we would love to have. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot