Home
News

6 ఏళ్ల బుడ్డది ఇంటర్నెట్ ప్రపంచాన్ని డ్యాన్సుతో షేక్ చేస్తోంది

By Gizbot Bureau

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమ టాలెంటుతో రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతున్నారు. ఇంతకు ముందు ఎందరో ఇలా స్టార్లుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు వీరి సరసన మరో పాప కూడా చేరింది. ఆరేళ్ల ఆఫ్రికా చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాని , ఇంటర్నెట్ ప్రపంచాన్ని తన డ్యాన్సులతో ఊపేస్తోంది. సెటబ్రిటీలు సోషల్ మీడియాలో షేర్లతో ఆ చిన్నారికి స్వాగతం పలుకుతున్నారు. ఈ పాప తన డాన్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. కాగా ఇదివరకే మన తెలుగు రాష్ట్రంలో తన గాన మాధుర్యంతో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఊపేసిన బేబీ కథ అందరికీ తెలిసిందే. ఇప్పుడు దక్షిణాఫ్రికా నుంచి ఈ చిన్నారి వేసిన డ్యాన్సుకు హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు ఫిదా అయిపోతున్నారు.

6 ఏళ్ల బుడ్డది ఇంటర్నెట్ ప్రపంచాన్ని డ్యాన్సుతో షేక్ చేస్తోంది

షేక్ చేస్తున్న డాన్స్‌ వీడియో
ముద్దుగా, బొద్దుగా ఉన్న ఈ పాప లయబ్ధంగా అలవోకగా చేస్తున్న నృత్యాలకు హాలీవుడ్‌ అగ్రతారల నుంచి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె చేసిన డాన్స్‌ వీడియోను అమెరికాకు చెందిన ప్రముఖ గాయని లిజో జూన్‌ 8న తన అధికారిక ట్విటర్‌ పేజీలో షేర్‌ చేయడంతో ఇవానా రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయింది.

అభిమానులు అయిన హాలీవుడ్‌ నటులు క్రిస్‌ ఇవాన్స్‌, విల్‌స్మిత్‌ కూడా ఆమెకు అభిమానులుగా మారిపోయాయి. వీరు కూడా తమ వ్యక్తిగత సోషల్‌ మీడియా పేజీల్లో ఈ చిన్నారి వీడియోలు షేర్‌ చేయడంతో ఆమెకు ఆదరణ అమాంతంగా పెరిగిపోయింది. ఇవానా వీడియోలకు లక్షల్లో లైకులు, వ్యూస్‌ రావడంతో ఇంటర్నెట్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.

6 ఏళ్ల బుడ్డది ఇంటర్నెట్ ప్రపంచాన్ని డ్యాన్సుతో షేక్ చేస్తోంది

దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ ఎలిజబెత్‌ నగరానికి చెందిన ఇవానా మే 30న ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. అప్పుడే ఆమె సుమారు లక్షా 90 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె పెట్టిన 12 పోస్ట్‌లను లక్షలాది మంది వీక్షించారు. ఇవానా డాన్స్‌ సూపర్‌ అంటూ ప్రశంసలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇవానా హావభావాలు అద్భుతమని తెగ పొగిడేస్తున్నారు.

ఆశ్చర్యపోతున్న నెటిజన్లు,
ఆ పాప ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటరయిన కొద్ది రోజులకే లక్షా 90 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకోవడంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇవానా వీడియో పెట్టగానే ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ టాప్ ట్రెండింగ్ లిస్టులో ఆమె వీడియోలు చోటు దక్కించుకున్నాయి.

6 ఏళ్ల బుడ్డది ఇంటర్నెట్ ప్రపంచాన్ని డ్యాన్సుతో షేక్ చేస్తోంది
కాగా ఇదివరకే డబ్బు అంకుల్ సోషల్ మీడియాను తన డ్యాన్సుతో షేక్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్ హీరోలు సైతం ఆయన డ్యాన్సుకి ఫిదా అయిపోయారు. ఏకంగా డబ్బు అంకుల్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టార్ గా మారిపోయారు.

Best Mobiles in India

English summary
This 6-Year-Old Girl is The New Internet Sensation! Will Smith, Chris Evans Are Impressed With Her Energetic Dancing Skills
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X