క్రోమ్ ట్రాఫిక్ 60% సురక్షితం

|

క్రోమ్ వెబ్ బ్రౌజర్ నుంచి వస్తోన్న 60 శాతం ఆండ్రాయిడ్ క్రోమ్ ట్రాపిక్‌ను హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ వర్షన్ (HTTPS) విజయవంతంగా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. గత ఏడాది కేవలం 42శాతం ఆండ్రాయిడ్ క్రోమ్ ట్రాపిక్‌ను మాత్రమే గూగుల్ ప్రొటెక్ట్ చేయగలిగిందట.

60% of Chrome traffic on Android is now protected: Google

వెబ్ బ్రౌజర్‌లకు సంబంధించిన సెక్యూరిటీ అంశాలను విశ్లేషించే క్రమంలో ఇటీవల నిర్వహించిన రెండు అధ్యయనాల్లో భాగంగా గూగుల్ క్రోమ్ అత్యంత సురక్షితమైన వెబ్ బ్రౌజర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో, ప్రమాదకరమైన సైట్లను గుర్తించటంలో, వల్నరబులిటీలను గుర్తించి వాటికి సెక్యూరిటీ ప్యాచస్ అందించటంతో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ముందుంజలో ఉన్నట్లు ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

క్రోమ్ వెబ్ బ్రౌజర్‌‌ను అత్యంత సురక్షితమైన బ్రౌజర్‌లా మలిచే క్రమంలో సెక్యూరిటీ స్టాండర్ట్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌టు‌డేట్‌గా బిల్డ్ చేస్తున్నట్లు గూగుల్ చెబుతోంది.

రూ. 1699కే Airtel 4జీ ఫోన్, కండీషన్లు మాత్రం చాలానే..రూ. 1699కే Airtel 4జీ ఫోన్, కండీషన్లు మాత్రం చాలానే..

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ప్రతి 100 టాప్ వైబ్‌సైట్‌లలో 71 సైట్‌లు HTTPS సెక్యూర్ వర్షన్‌ను డీఫాల్ట్‌గా ఉపయోగించుకోగలుగుతున్నాయని, దీంతో క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు Mac ఓఎస్‌ల నుంచి వస్తోన్న 75% వరకు క్రోమ్ ట్రాఫిక్ ను విజయవంతంగా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నామని గూగుల్ క్రోమ్ సెక్యూరిటీ మెనేజర్ ఎమిలే స్చెచ్టర్ తెలిపారు.

గూగుల్ విశ్లేషణ ప్రకారం గత ఏడాది ప్రతి 100 టాప్ వైబ్‌సైట్‌లలో 37 సైట్‌లు మాత్రమే HTTPS సెక్యూర్ వర్షన్‌ను కలిగి ఉండేవట. ఇదే సమయంలో క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి 60% క్రోమ్ ట్రాఫిక్‌ను మాత్రమే ప్రొటెక్ట్ చేయగలిగే వారట.

HTTPS ప్రోటోకాల్‌ను వినియోగించుకుంటోన్న వెబ్‌సైట్‌ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగినట్లు గూగుల్ చెబుతోంది. ముఖ్యంగా జపాన్‌లో HTTPS యూసేజ్ 31% నుంచి 55 శాతానికి పెరిగిందట. Rakuten, Cookpad, Ameblo, Yahoo Japan వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు HTTPS సెక్యూర్ వర్షన్‌ వైపు అడుగులు వెసినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

మనం ఇంటర్నెట్‌లో చేసే బ్రౌజింగ్ అలానే ఆన్‌లైన్ చెల్లింపులను సురక్షితంగా ఉంచటంలో ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ(TLS), సెక్యూర్ సాకెట్స్ లేయర్‌లు (SSL) కీలక పాత్ర పోషిస్తాయి. హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ (HTTPS) అనేది మీ ఆన్‌లైన్ లావాదేవీలను అదనపు సెక్యూరిటీని అందిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
HTTPS usage surge recently in Japan; large sites like Rakuten, Cookpad, Ameblo, and Yahoo Japan all made major headway towards HTTPS in 2017.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X