Flipkart సేల్స్: ఈ TWS ఇయర్ బడ్స్‌పై 62శాతం డిస్కౌంట్లు!
భారత్‌లో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా.. Flipkart బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ అద్భుతమైన ఆఫర్‌లు మరియు డిస్కౌంట్‌లతో కొనసాగుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ సేల్ సెప్టెంబర్ 22న ప్లస్ మెంబర్స్‌కు, సెప్టెంబర్ 23 నుంచి మిగతా కస్టమర్లందరికీ ప్రారంభమైంది. ఈ సేల్‌లో Apple, Xiaomi, Samsung, Motorola మరియు ఇతర బ్రాండ్‌ల నుండి స్మార్ట్‌ఫోన్‌లపై Flipkart కొన్ని ఉత్తమమైన డీల్స్ మరియు డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇవేకాకుండా, పలు బ్రాండ్లకు చెందిన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్(TWS ) పైనా ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

సంగీత ప్రియులు ఎవరైనా మంచి సౌండ్ అనుభూతిని కల్పించే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్(TWS) కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయంగా భావించవచ్చు. బ్లూ టూత్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించే బడ్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్ లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై, మొత్తం కార్ట్ విలువ రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ సేల్ చేసిన యూజర్లకు రూ.1,750 వరకు ఆఫర్లు అందిస్తున్నారు. ఇక్కడ పేర్కొన్న బ్యాంకుల్లో ఏదైనా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు కోసం చెల్లించే వినియోగదారులు గరిష్టంగా 10% లేదా రూ.1,000 తగ్గింపు పొందుతారని కంపెనీ వెల్లడించింది. అయితే, బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన ఆఫర్‌లతో అందుబాటులో ఉన్న ఉత్తమ TWS ఇయర్‌బడ్‌ల జాబితాను ఇక్కడ మేము జాబితా చేసాము. మీరు కూడా ఓ లుక్కేయండి.

Apple AirPods 2nd Gen:
యాపిల్ కంపెనీకి చెందిన ఈ ఇయర్‌బడ్స్ అత్యంత ప్రీమియం TWS ఇయర్‌బడ్స్. Apple AirPods 2వ తరం, మంచి సౌండ్ క్వాలిటీ మరియు మన్నికైన కనెక్టివిటీని అందిస్తుంది. కాగా దీని ధర రూ.14,100 కాగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 36శాతం తగ్గింపుతో రూ.8,999కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లను వర్తింపజేసినప్పుడు, ఈ TWS ఇయర్‌బడ్స్ ధర రూ.8,099కి తగ్గుతుంది. 8,099, ఓ రకంగా ఇది చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు.

Samsung Galaxy Buds 2:
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా మంచి ఆఫర్ కలిగిన ప్రీమియం ఇయర్ బడ్స్‌లో Samsung Galaxy Buds 2 కూడా ఉంది. ఇది కంపెనీ Galaxy లైనప్‌లోని అన్ని పరికరాల మధ్య సజావుగా సమన్వయం చేస్తుంది. ధర సాధారణంగా రూ.13,990 గా ఉంది, కానీ ప్రస్తుతం ఇది సేల్ లో భాగంగా ఈ TWS ఆఫర్ 57% భారీ తగ్గింపుతో జాబితా చేయబడింది మరియు దీంతో దీని ధర రూ.5,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో, Samsung TWS ఆఫర్ యొక్క ప్రభావవంతమైన ధర రూ.5,399కి పడిపోతుంది.

Sony WF-XB700:
అద్భుతమైన బేస్‌ను అందించే TWS ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి Sony WF-XB70 అనువైనది. ఈ ప్రీమియం జత ఇయర్‌బడ్‌ల ధర సాధారణంగా Flipkartలో రూ.11,990 ఉంటుంది. కానీ, ఇప్పుడు సేల్‌లో భాగంగా, 50% తగ్గింపుతో రూ.5,990 కొనుగోలు దారులకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా, బ్యాంక్ ఆఫర్‌లు సోనీ TWS ఇయర్‌బడ్‌ల ప్రభావవంతమైన ధరను రూ.5,391కి తగ్గిస్తాయి.

Oppo Enco Buds:
Oppo Enco Buds అనేది Dolby Atmos సపోర్ట్ మరియు AI-ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఉపయోగకరమైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ TWS ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఇయర్ బడ్స్ సాధారణ ధర వచ్చేసి రూ.3,999 గా ఉంది. కానీ, సేల్ సమయంలో, వీటిని 62శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.1,499 కొనుగోలు చేయవచ్చు.

Realme Buds Air 3:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా సంగీత ప్రియులకు కొనుగోలు చేయడానికి మరో మంచి డీల్ ఈ Realme Buds Air 3. ఈ బడ్స్ సాధారణ ధర రూ.5,999 గా ఉంటుంది, కానీ, సేల్‌లో భాగంగా వీటిని TWS ఇయర్‌బడ్‌లను రూ.3,299 కి కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications