64జీబి వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 తగ్గింపు

Posted By:

64జీబి వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 తగ్గింపు

వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్ పై అమెజాన్ అందిస్తోన్న ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌కు ఎట్టకేలకు తెరపడింది, ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,000 ధర తగ్గింపుతో విక్రయించేందుకు ఫ్లిప్‌‌కార్ట్ ముందుకొచ్చింది. జూన్ 22వ తేది నుంచి 24వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న బిగ్ యాప్ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా 64జీబి వేరియంట్ వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.21,998కి విక్రయిస్తోంది. జూన్ 24 తరువాత ఈ ఫోన్‌ను సాధారణ ధర అంటే రూ.21,998కే విక్రయిస్తారు.

64జీబి వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 తగ్గింపు

వన్‌ప్లస్ వన్ 64జీబి స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.5 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందించే శ్యానోజెన్ ఓస్ 12 లేదా వన్ ప్లస్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 64జీబి ఇంటర్నల్ మెమరీ.

English summary
64GB OnePlus One goes cheaper on Flipkar. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting