యాపిల్ ఐఫోన్ గురించి 7 ఆసక్తికర నిజాలు

Posted By:

సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం జనవరి 9వ తేదీన స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసారు. అప్పటి నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసిస్తూనే వస్తున్నాయి. సెప్టంబర్ 2013 వరకు సేకరించిన వివరాల మేరకు 420 మిలియన్లుకు పైగా ఐఫోన్ యూనిట్లను యాపిల్ ప్రపంచవ్యాప్తంగా విక్రయించినట్లు అంచనా. యాపిల్ మొత్తం ఆదాయంలో 53శాతం వాటా యాపిల్ ఐఫోన్‌లదేనట.

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5ఎస్‌గా ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. యాపిల్ ఐఫోన్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 7 ఆసక్తికర నిజాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్ గురించి 7 ఆసక్తికర నిజాలు

యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌ను జనవరి 2007 శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్ వరల్డ్ కాన్ఫిరెన్స్‌లో ఆవిష్కరించటం జరిగింది. యాపిల్ దివంగత సీఈఓ స్టీవ్ జాబ్స్ యాపిల్ ఐఫోన్‌ను ‘రివల్యూషనరీ ఇంకా మ్యాజికల్' ఉత్పత్తి‌గా అభివర్ణించారు.

 

యాపిల్ ఐఫోన్ గురించి 7 ఆసక్తికర నిజాలు

సెప్టంబర్ 2013 వరకు అందిన లెక్కల ప్రకారం యాపిల్ 420 మిలియన్లకు పై ఐఫోన్ యూనిట్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించినట్లు సమాచారం.

యాపిల్ ఐఫోన్ గురించి 7 ఆసక్తికర నిజాలు

యాపిల్ అప్లికేషన్ స్టోర్ ద్వారా 2008 నుంచి ఇప్పటి వరకు 50 బిలియన్ల అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం.

యాపిల్ ఐఫోన్ గురించి 7 ఆసక్తికర నిజాలు

యాపిల్ మొత్తం ఆదాయంలో 53శాతం వాటా యాపిల్ ఐఫోన్‌లదే!.

యాపిల్ ఐఫోన్ గురించి 7 ఆసక్తికర నిజాలు

2013లో యాపిల్ అప్లికేషన్ స్టోర్ ద్వారా వచ్చిన ఆదాయం $10బిలియన్లట.

యాపిల్ ఐఫోన్ గురించి 7 ఆసక్తికర నిజాలు

అప్లికేషన్ డెవలపర్ల నిమిత్తం యాపిల్ ఇప్పటి వరకు $15 బిలియన్లను విక్రయించినట్లు సమాచారం.

యాపిల్ ఐఫోన్ గురించి 7 ఆసక్తికర నిజాలు

ఒరిజనల్ ఐఫోన్‌తో పోలిస్తే ఐఫోన్ 5ఎస్ 20 శాతం తక్కువ బరువును కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot