మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి!

|

ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది మనకు చాలా విలువైన వస్తువుగా మారిపోయింది. ప్రతి ఒక్కరు వారివారి బడ్జెట్ పరిధిలో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చేతిలోని ఫోన్ దురదృష్టవశాత్తూ డామెజ్‌కు గురవటం కాని, చోరీకి గురువటం కాని జరిగితే ప్రాణం విలవిలలాడిపోతోంది.

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి!

Read More : రూ.800 కడితే మోటరోలా ఫోన్ ఇచ్చేస్తున్నారు

దీనికి కారణం, ఫోన్‌ల పై మనం పెంచుకుంటున్న ఇష్టం. మన రోజువారి కార్యకలాపాల్లో, ఫోన్‌లు ఇంతాలా మనతో మమేకమవటానికి కారణం అవి కల్పిస్తోన్నకమ్యూనికేషన్ వసతులే. మీ ఫోన్ ఎప్పటికప్పుడే సేప్టీ జోన్‌లో ఉండాలంటే, ఈ సందర్బాలు ఎదురుకాకుండా చూస్కోండి...

డ్రైవింగ్ చేస్తూ...

డ్రైవింగ్ చేస్తూ...

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం ప్రమాదకరం. ఈ చర్య ప్రమాదాలకు కారణమవుతోంది. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండండి.

ఎండలో వదలకండి...

ఎండలో వదలకండి...

చాలా మంది తమ ఫోన్‌లను ఎండలో వదిలేసి వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. అధిక వేడి అలానే అధిక చల్లధనం ఫోన్ జీవితకాలాన్ని హరించివేయగలదు.

నిర్లక్ష్యం వద్దు..

నిర్లక్ష్యం వద్దు..

పొరపాటున కాఫీ మీ ఫోన్ పై ఒలికినట్లయితే ఫోన్ స్ర్కీన్, స్పీకర్ వంటి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీ ఫోన్‌ను కాఫీ కప్‌కు దూరంగా ఉంచండి.

ఫోన్‌ను వెనుక జేబులో...

ఫోన్‌ను వెనుక జేబులో...

ఫోన్‌ను వెనుక జేబులో క్యారీ చేయటమనేది ఏ మాత్రం మంచి ఆలోచన కాదు.ఇలా చేయటం వల్ల ఫోన్ స్ర్కీన్ దెబ్బతినే ప్రమాదముంది. అంతేకాదు కొన్ని కొన్ని సందర్బాల్లో ఫోన్ ఒవర్ హీట్ అయి ఫిజికల్ డామెజ్ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

బాత్‌రూమ్‌లలో కూడా స్మార్ట్‌ఫోన్‌లను...

బాత్‌రూమ్‌లలో కూడా స్మార్ట్‌ఫోన్‌లను...

బాత్‌రూమ్‌లలో కూడా స్మార్ట్‌ఫోన్‌లను విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి నేటి యాంత్రిక ప్రపంచంలో నెలకుంది. ఈ చర్య అంత మంచిదేమి కాదు. బాత్‌రూమ్‌లోనూ స్మార్ట్‌ఫోన్‌ పై ధ్యాసను కేంద్రీకరించటం కారణంగా వ్యక్తిగత సంరక్షణను నిర్లక్ష్యం చేసే అవకాశం లేకపోలేదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ పొరపాటు మీ ఫోన్ బాత్రూమ్‌లో పడితే వాటిల్లే నష్టం కూడా అంతేలా ఉంటుంది.

ఫోన్‌లను బ్యాగ్ అడుగున...

ఫోన్‌లను బ్యాగ్ అడుగున...

చాలా మంది రెగ్యులర్ ట్రావెలర్స్ తమ ఫోన్‌లను బ్యాగ్ అడుగున పడేస్తుంటారు. ఈ కారణంగా ఫోన్ పై హీట్ లేదా ఒత్తిడి పెరిగి పనితీరు మందగించే అవకాశముంది.

వంటగదిలోనూ ప్రమాదమే..

వంటగదిలోనూ ప్రమాదమే..

చాలా మంది తమ ఫోన్‌లను వంటగదిలోనూ ఉపయోగించేస్తుంటారు. ఫోన్‌లను కుకింగ్‌కు దగ్గరగా ఉంచటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అధిక వేడి ఉత్పన్నమైన ఫోన్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.

Best Mobiles in India

English summary
7 places where you should never keep your phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X