Huawei స్మార్ట్‌వాచ్ వచ్చేసింది
ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ హువావే (Huawei) తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ధర రూ.22,999. మోటో 360 (సెకండ్ జనరేషన్), సామ్‌సంగ్ గేర్ ఎస్2, యాపిల్ వాచ్ వంటి ప్రముఖ వాచ్‌లకు పోటీగా విడుదలైన హువావే స్మార్ట్‌వాచ్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. వై-ఫై లేదా బ్లుటూత్ కనెక్టువిటీ సహాయంతో ఈ ఆండ్రాయిడ్ వేర్‌వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. వాచ్ ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...
Read More : 7 అంగుళాల డిస్‌ప్లేతో Lenovo స్మార్ట్‌ఫోన్

Huawei స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు
హువావే స్మార్ట్‌వాచ్ సఫైర్ క్రిస్టల్ లెన్స్‌తో కూడిన 1.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 400x400పిక్సల్స్)తో వస్తోంది.

Huawei స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు
హువావే స్మార్ట్‌వాచ్ ఐపీ67 వాటర్ అలానే డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. ఈ వాచ్ నీటిలో పడినప్పటికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదు.

Huawei స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు
1.4గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన శక్తివంతమైన డ్యయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ చిప్‌ను ఈ స్మార్ట్‌వాచ్‌లో పొందుపరిచారు.

Huawei స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు
512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ ఆఫ్షన్స్ వాచ్ హార్డ్‌వేర్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. వాచ్ స్టోరేజ్ స్పేస్‌లో బోలెడన్ని యాప్స్ భద్రపరచుకోవచ్చు.

Huawei స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు
6- యాక్సిస్ మోషన్ సెన్సార్, బారో మీటర్‌తో పాటు హార్ట్‌రేట్ మానిటర్‌ను హువావే స్మార్ట్‌వాచ్‌లో పొందుపరిచారు.

Huawei స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు
హువావే స్మార్ట్‌వాచ్ 300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

Huawei స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు
గోల్డ్, సిల్వర్, బ్లాక్‌తో పాటు అనేక రకాల కలర్ వేరియంట్‌లలో హువావే స్మార్ట్‌వాచ్ లభ్యంకానుంది. కాబట్టి, వాచ్‌ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








