Jio నెట్‌వర్క్‌లోకి మారదామనుకుంటున్నారా? ఇవిగోండి 7 సులువైన మార్గాలు

|

ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల నుంచి వస్తోన్న ఎంఎన్‌పీ రిక్వస్ట్‌లను జియో 4జీ స్వీకరిస్తోంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో 4జీకి పోర్ట్ అవ్వాలనుకుంటన్న వ్యక్తులు ముందుగా చేయవల్సిన పనులు...

Read More : ఐడియా కొత్త ఆఫర్.. రూ.1కే అన్‌లిమిటెడ్ 4జీ

స్టెప్ 1

స్టెప్ 1

ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియోలోకి పోర్ట్ అవ్వాలనకుంటున్నారా..? అయితే మీ వద్ద తప్పనిసరిగా లేటెస్ట్ 4జీVOLTE సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే జియో అనేది పూర్తిస్థాయిలో 4జీ నెట్‌వర్క్.

స్టెప్ 2

స్టెప్ 2

ఎంఎన్‌పీ ద్వారా రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లోకి మారటం ద్వారా తమ పాత నెంబర్ అలానే ఉండటంతో పాటు Jio Welcome ఆఫర్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

స్టెప్ 3

స్టెప్ 3

ముందుగా మీ మొబైల్ నెంబర్ నుంచి పోర్ట్ (port) అని టైప్ చేసి కొంత స్పేస్ ఇచ్చి బ్రాకెట్లో మీ మొబైట్ నెంబర్‌ని జత చేసి 1900కి ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు మీకు రూ.1 ఖర్చవుతుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఎనిమిది అంకెల యూనిక్ పోర్టింగ్ కోడ్ 1901 నెంబర్ నుంచి మీ మొబైల్‌కు మెసేజ్ రూపంలో అందుతుంది. ఈ కోడ్ వ్యాలిడిటీ 15 రోజులు మాత్రమే.

స్టెప్ 4

స్టెప్ 4

తరువాత స్టెప్‌లో భాగంగా మీ 4జీ స్మార్ట్‌ఫోన్‌లో MyJio appను డౌన్‌లోడ్ చేయండి. ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మీకు ఒక యునిక్ బార్‌కోడ్ లభిస్తుంది. ఈ కోడ్ ఆధారంగా మీకు జియో సిమ్ జారీ చేయటం జరుగుతుంది.

స్టెప్ 5

స్టెప్ 5

ఇప్పుడు మీ దగ్గర భద్రంగా ఉన్న యునిక్ పోర్టింగ్ కోడ్‌తో పాటు జియో సిమ్‌కు సంబంధించిన బార్ కోడ్‌ను తీసుకుని సమీపంలోని రిలయన్స్ డిజటల్ లేదా ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌కు వెళ్లండి. వీటితో పాటు మీ ఆధార్ జిరాక్స్‌తో పాడు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా తీసుకువెళ్లండి. సిమ్ యాక్టివేషన్ ప్రక్రియలో భాగంగా ఈ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి.

స్టెప్ 6

స్టెప్ 6

ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే Jio Welcome ఆఫర్‌తో కూడిన జియో 4జీ సిమ్ కార్డ్ మీకు అందుతుంది. ఎంఎన్‌పీ ప్రాసెస్ విజయవంతమైన వెంటనే మీరు వాడుతున్న పాత నెట్‌వ‌ర్క్ క‌ట్ అయిపోతుంది. అలా జరిగిన వెంటనే మీ జియో సిమ్ యాక్టివేట్ అవుతుంది..

స్టెప్ 7

స్టెప్ 7

అలా యాక్టివేట్ అయిన జియో సిమ్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా Jio Welcome offerను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. దీని కన్నా ముందు యూజర్లు టెలీ వెరిఫికేష‌న్ ద్వారా మీ వివ‌రాల‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
7 Steps to Port Your Existing Number to Reliance Jio 4G. Read More in Telugu Gizbot... Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X