Jio 4G.. 10 లాభాలు
Reliance Jio 4జీ, ఇప్పడు అందరికి అందుబాటులోకి వచ్చేసింది. వస్తూవస్తూనే దిమ్మతిరిగే ఆఫర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో తాజాగా లాంచ్ చేసిన వెలకమ్ ఆఫర్‌లో భాగంగా సియో సిమ్‌ను సొంతం చేసుకునే యూజర్లకు డిసెంబర్ 31, 2016 వరకు తన అన్ని సేవలను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. జియో 4జీ సిమ్‌ను పొందటం వల్ల చేకూరే ప్రయోజనాలను ఓసారి చూద్దాం...
Read More : 3జీ ఫోన్‌ను 4జీ ఫోన్‌లా మార్చటం ఎలా..?

మొట్టమొదటి LTE-only నెట్‌వర్క్
రిలయన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి LTE-only నెట్‌వర్క్ కావటం. ఈ సౌలభ్యతతో జియో సిమ్ యూజర్లు నెట్‌వర్క్ డ్రాపింగ్ సమస్యలను ఫేస్ చేసే అవకాశముండదు. ఇది ఖచ్చితంగా రిలయన్స్ జియోకు కలిసొచ్చే అంశం.

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం.
VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా రిలయన్స్ జియోకు కలిసొచ్చే అంశం.

వాయిస్ కాలింగ్ ఇంకా టెక్స్ట్ మెసేజింగ్
రిలయన్స్ జియోలో వాయిస్ కాలింగ్ ఇంకా టెక్స్ట్ మెసేజింగ్ పూర్తిగా ఉచితం. అయితే TRAI నిబంధనలు ప్రకారం రోజుకు మీరు 100 ఎస్ఎంఎస్‌లు మాత్రమే పంపుకోవాలి.

ఎటువంటి రోమంగ్ ఛార్జీలు ఉండవు
రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో ఎటువంటి రోమంగ్ ఛార్జీలు లేకుండా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా రిలయన్స్ జియోకు కలిసొచ్చే అంశం.

వై-ఫై డేటా ఉచితం
రిలయన్స్ జియో తన టారిఫ్ ప్లాన్స్‌లో భాగంగా వై-ఫై డేటాను కూడా యూజర్లకు అందిస్తోంది. ఈ డేటాను ఉపయోగించుకుని పబ్లిక్ ప్రాంతాల్లో రిలయన్స్ ఏర్పాటు చేసే జియో వై-ఫై హాట్ స్పాట్‌ల వద్ద ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు.

జియో యాప్ సూట్
డిసెంబర్ 31 2017 వరకు రిలయన్స్ జియో యాప్ సూట్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ యాప్ సూట్ నెల వారీ చందా రూ.1250గా ఉంది. ఈ సూట్ లో ఉండే యాప్స్ ద్వారా సినిమాలు, పాటలతో ఇతర ప్రత్యేక సేవలను ఆస్వాదించవచ్చు.

LYF బ్రాండ్ పేరిట చౌక ధర 4G ఫోన్స్
జియో తన 4G సేవలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో LYF బ్రాండ్ పేరిట చౌక ధర 4G ఫోన్‌లను మార్కెట్లో ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ ల ప్రారంభ ధర రూ.2,999. జియో సిమ్ యాక్టివేషన్ + ఆఫర్లతోతో ఈ ఫోన్ లు లభిస్తాయి.

'Jio welcome offer'
'Jio welcome offer'లో భాగంగా ప్రతిఒక్కరూ జియో సర్వీసులను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అంటే డిసెంబర్ 31 వరకు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జనవరి 1 నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. 1జీబి డేటా ఖరీదు రూ.50 మాత్రమే. 75జీబి కన్నా ఎక్కువ వాడే వారిక రూ.25కే జీబి డాటా లభిస్తుంది. పండుగల.. ప్రత్యేక రోజుల్లో స్పెషల్ ఛార్జీలు ఉండవు.

వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం
రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే వారికి వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. లోకల్, ఎస్‌టీడీ తేడా ఉండదు. దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకోవ్చు. రోమింగ్ ఛార్జీలు ఉండవు.

జియో టారిఫ్స్ వివరాలు
జియో టారిఫ్స్ వివరాలు రూ.19కే 100 ఎంబీ 4జీ డేటా ఇస్తారు. ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ పథకంలో రోజు మొత్తం వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. రాత్రి పూట డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. రూ.129కి 750 ఎంబీ 4జీ డేటాను ఇస్తారు. 7 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ పథకంలో వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. రాత్రి పూట డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 1.5జీబి జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితం. రూ.221కి 2జీబి డేటా ఇస్తారు. 21 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ పథకంలో వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. రాత్రి పూట డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉపయోగించుకోవచ్చు.

రూ.148 స్టార్టర్ ప్యాక్‌లో భాగంగా..
రూ.148 స్టార్టర్ ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 300ఎంబీ 4జీ డాటా లభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.

రూ.499 ప్యాక్‌లో భాగంగా...
రూ.499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 4జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది. ఈ 28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 8జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.999 ప్యాక్‌లో భాగంగా....
రూ.999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 10జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 20జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.1499 ప్యాక్‌లో భాగంగా...
రూ.1499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 20జీ 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 40జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.2499 ప్యాక్‌లో భాగంగా...
రూ.2499 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 35జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 70జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.3999 ప్యాక్‌లో భాగంగా...
రూ.3999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 60జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 120జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.

రూ.4999 ప్యాక్‌లో భాగంగా...
రూ.4999 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 75జీబి 4జీ డాటా + అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్ లిభిస్తుంది.28 రోజులు వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అపరిమితంగా ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 150జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ కూడా ఉచితంగా లభిస్తుంది.


Click it and Unblock the Notifications








