యాపిల్ మాజీ ఉద్యోగులు ప్రారంభించిన 7 బెస్ట్ కంపెనీలు

Posted By:

టెక్నాలజీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న యాపిల్ విప్లవాత్మక ఆవిష్కరణలతో అంచెలంచెలుగా విస్తరిస్తోంది. యాపిల్ దాదాపు తన 40 సంవత్సరాల ప్రస్థానంలో ఎందరో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు తమ కంపెనీలో అవకాశమిచ్చింది. వీరు కనబర్చిన అపారమైన వృత్తి నైపుణ్యాలు యాపిల్ నెం.1గా నిలబెట్టటంలో కీలక పాత్ర పోషించాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఒకప్పుడు యాపిల్ కంపెనీలో కీలక పాత్ర పోషించి ఆ తరువాత తమకంటూ సొంత కంపెనీలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా ముందుకు సాగుతోన్న పలువురు యాపిల్ మాజీ ఉద్యోగుల వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెస్ట్ ల్యాబ్స్ (Nest Labs)

యాపిల్ మాజీ ఉద్యోగులు ప్రారంభించిన 7 బెస్ట్ కంపెనీలు

నెస్ట్ ల్యాబ్స్ (Nest Labs)

మాజీ యాపిల్ ఇంజినీర్లైన టోనీ ఫిడిల్, మాట్ రోజర్స్‌లు సంయుక్తంగా నెస్ట్ ల్యాబ్స్ కంపెనీని ప్రారంభించారు. కనెక్టెడ్ థెర్మోస్టాట్స్‌తో పాటు స్మోమ్ డిటెక్టర్లను ఈ కంపెనీ తయారు చేస్తుంది. నెస్ట్ ల్యాబ్స్‌ను 3.2బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు గూగుల్ 2014లో ప్రకటించింది.

 

ఓబీ మొబైల్ (Obi Mobile)

యాపిల్ మాజీ ఉద్యోగులు ప్రారంభించిన 7 బెస్ట్ కంపెనీలు

ఓబీ మొబైల్ (Obi Mobile)

యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ జాన్ స్కల్లీ ఓబీ మొబైల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గల్ఫ్ దేశాల్లో ఈ ఫోన్‌లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది.

 

ఆండ్రాయిడ్ (Android)

యాపిల్ మాజీ ఉద్యోగులు ప్రారంభించిన 7 బెస్ట్ కంపెనీలు

ఆండ్రాయిడ్ (Android)

యాపిల్ ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రధాన పోటీదారుగా నిలిచిన ఆండ్రాయిడ్‌ను సృష్టించింది యాపిల్ మాజీ ఇంజినీర్ కావటం విశేషం. 1992లో యాపిల్ నుంచి బయటకు వచ్చేసిన ఆండీ రూబిన్ 2003లో ఆండ్రాయిడ్ ఇంక్‌ను ప్రారంభించారు. 2005లో ఈ కంపెనీని గూగుల్ చేజిక్కించుకుంది. ఐడీసీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తోన్న ఫోన్‌లలో 85శాతం ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఓఎస్ పై నడిచేవే.

 

ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (Electronic Arts)

యాపిల్ మాజీ ఉద్యోగులు ప్రారంభించిన 7 బెస్ట్ కంపెనీలు

ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (Electronic Arts)

ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ పేరుతో వీడియో గేమ్ కంపెనీని స్థాపించి తనకంటూ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ట్రిప్ హాకిన్స్ యాపిల్ మాజీ ఉద్యోగి కావటం విశేషం.

 

పాత్ (Path)

యాపిల్ మాజీ ఉద్యోగులు ప్రారంభించిన 7 బెస్ట్ కంపెనీలు

పాత్ (Path)

ఈ సోషల్ నెట్‌వర్కింగ్ మొబైల్ యాప్ కంపెనీకి సహ వ్యవస్థాపకులుగా యాపిల్ మాజీ ఉద్యోగి డేవ్ మోరిన్ వ్యవహరిస్తున్నారు. మోరిన్ 2004 నుంచి 2006 వరకు యాపిల్ కంపెనీలో విధులు నిర్వహించారు. ఆ తరువాత ఫేస్‌బుక్‌లో కూడా పనిచేసారు.

 

ఫ్లిప్‌బోర్డ్ (Flipboard)

యాపిల్ మాజీ ఉద్యోగులు ప్రారంభించిన 7 బెస్ట్ కంపెనీలు

ఫ్లిప్‌బోర్డ్ (Flipboard)

ఈ సోషల్ మీడియా యాప్ కంపెనీకి సహ వ్యవస్థాపకులుగా యాపిల్ మాజీ ఉద్యోగి ఇవాన్ డాల్ వ్యవహరిస్తున్నారు. యాపిల్ కంపెనీలో సీనియర్ ఐఫోన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఇవాన్ 2009లో కంపెనీని వీడారు. ఆ తరువాత ఫ్లిప్‌బోర్డ్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు.

 

ఇంక్లింగ్ (Inkling)

యాపిల్ మాజీ ఉద్యోగులు ప్రారంభించిన 7 బెస్ట్ కంపెనీలు

ఇంక్లింగ్ (Inkling)

ఇంక్లింగ్, ఈ ఇంటరాక్టివ్ ఈ-బుక్ పబ్లిషింగ్ కంపెనీకి యాపిల్ మాజీ ఉద్యోగి మాట్ మాక్ ఇన్నీస్ సహ వ్యవస్థాపకులుగా వ్యవహరిస్తున్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Successful Companies Founded By Former Apple Employees. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting