రండి...‘రెచ్చగొట్టి రుచిచూపిస్తాయ్’

Posted By:
  X

  ‘మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రకృతి ప్రసాదించిన పండ్లు ఎంతగానో దోహదపడతాయి. రోజు రోజుకి పెరిగిపోతున్నఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజు ఓ పండును తినటం అలవాటు చేసుకోవాలి'

  గృహ వినియోగానికి ఉపయోగపడే అనేక సాంకేతిక ఉపకరణాలను మీరు చూసే ఉంటారు. ఈ శీర్షికలో పొందుపరిచిన 7 అత్యుత్తమ గృహోపకరణాలు ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా ఉంచుతాయనటంతో ఏమాత్రం సందేహం లేదు. క్రింది గ్యాలరీలో పొందుపరిచిన 7 మిక్సర్ గాడ్జెట్‌లు పండ్ల నుంచి సువాసనలతో కూడిన తాజా రసాలను మీకు అందిస్తాయి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  వోఎక్స్‌వో చోపర్ (OXO Chopper):

  ఫ్రూట్ సలాడ్‌లను ఇష్టపడే వారికి ఈ పోర్టబుల్ ‘వోఎక్స్‌వో చోపర్' ఉత్తమ ఎంపిక. ఈ సాంకేతిక ఉపకరణం చేతికి అంతగా శ్రమపెట్టకుండా ఇష్టమైన ఫ్రూట్ సలాడ్‌లను క్షణాల్లో పూర్తి చేస్తుంది. ధర రూ.1078.

  యాపిల్ పీలర్ ఇంకా కోరర్ (Apple Peeler and Corer) :

  ఈ సంప్రాదాయ వంటింటి ఉపకరణం యాపిల్ పై ఉన్న తోలును కావల్సిన రీతిలో తొలగిస్తుంది. ఈ పరికరాన్ని బంగాళదుంప ఇంకా బేరీ పండ్ల శుద్ధికి ఉపయోగించుచోవచ్చు.

  హామిల్టన్ బీచ్ సింగిల్ - సెర్వ్ బ్లెండర్ విత్ ట్రావెట్ లిడ్ (Hamilton Beach Single-Serve Blender With Travel Lid):

  ఈ సులువైన గాడ్జెట్ పిక్నిక్ ఇతర ప్రయణా సమయాల్లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్యూస్ ఇంకా ఫ్రూట్ షేక్‌లను తాజాగా స్టోర్ చేస్తుంది. దింతో ప్రయాణాల్లోనూ మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోవచ్చు.

   

  బ్రివిల్లీ కాంపాక్ట్ జ్యూస్ ఫౌంటేన్ ఎక్స్ ట్రాక్టర్ (Breville Compact Juice Fountain Extractor):

  పండ్ల నుంచి తాజా రసాలను ఈ గృహోపకరణం అందిస్తుంది. ప్రత్యేక బటన్‌ను క్లిక్ చేయటం ద్వారా తయారైన జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. ధర 5390.

  ఫ్రోజోన్ ఫ్రూట్ సాఫ్ట్ సెర్వ్ ప్రాసెసర్(Frozen Fruit Soft Serve Processor):

  ఈ డివైజ్ వివిధ రకాల ఫ్రోజోన్ పండ్లను వివిధ సువాసనలతో మేళవించి సాఫ్ట్ - సెర్వ్ ట్రీట్‌ను చిటెకలో అందిస్తుంది. ధర రూ.3770.

  అలిస్సీ ఎలక్ట్రిక్ సిట్రస్ స్క్వీజర్ (Alessi Electric Citrus Squeezer):


  సిట్రస్ ఫలాలను చేతితో హ్యాండిల్ చేయటం కష్టతరంగా ఉంటుంది. ఈ ప్రత్యేక ఉపకరణం నిమ్మ, నారింజ, బత్తాయి పండ్ల నుంచి సౌకర్యవంతంగా విటిమిన్ ‘సీ'ని సేకరిస్తుంది.

  కిలో ఫ్రూట్ జాకెట్స్ (Kilo Fruit Jackets):

  ఈ ఫ్రూట్ జాకెట్‌లు ప్రయాణ సందర్భాల్లో తీసుకువెళ్తున్న పండ్లను ఒత్తడి గురుకాకుండా సురక్షిత స్ధానాల్లో ఉంచుతాయి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more