షియోమి క్రౌడ్ ఫండింగ్ గురించి మీకు ఎంతవరకు తెలుసు..?

|

దేశీయ రంగంలో టాప్‌లో దూసుకుపోతున్న చైనా కంపెనీ షియోమి ఇండియాలో క్రౌడ్ ఫండింగ్ సిస్టంను ప్రారంభించింది. షియోమి నుంచి వచ్చే ఉత్పత్తులపై రివ్యూలు అలాగే లైకులతో షియోమి తన Crowdfundingను ఇండియాలో నిర్వహించనుంది. దీని ప్రధాన ఉద్దేశం షియోమి ఉత్పత్తిచేసిన ప్రొడక్ట్ తను అనుకున్న రేంజులో కస్టమర్లను ఆకట్టుకోలేకుంటే కంపెనీ ఆ ఉత్పత్తి మీద కొనుగోలుదారుడు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తుంది. చైనా తర్వాత ఈ ప్లాట్‌ఫాంను ప్రారంభించిన రెండో దేశం భారత్‌ కావడం విశేషం.ఈ క్రౌడ్‌ఫండింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా షియోమి సంస్థ తయారు చేసిన కొన్ని ఆవిష్కరణ ఉత్పత్తులను విక్రయించనుంది. ఈ క్రౌడ్‌ఫండింగ్‌ మీద 7 ఆసక్తికర విషయాలు యూజర్ల కోసం..

 

షియోమి లాస్ట్ డే ఆఫర్స్,డీల్స్ ,డిస్కౌంట్లు మీకోసం..షియోమి లాస్ట్ డే ఆఫర్స్,డీల్స్ ,డిస్కౌంట్లు మీకోసం..

Mi Crowdfunding

Mi Crowdfunding

What Is Xiaomi's Mi Crowdfunding?
ఇది తొలిసారిగా చైనా దేశంలో ఆవిష్కరించింది. ఆ తర్వాత రెండో దేశంగా ఇండియా నిలిచింది. దీని ద్వారా షియోమి తన కొత్త ఆవిష్కరణ ఉత్పత్తులను ఇండియాలో విక్రయానికి ఉంచుతుంది. చిన్న చిన్న ఉత్పత్తులు ఇందులో అమ్మకానికి వస్తాయి. కాగా షియోమి ఇప్పటికే air purifiers, drones మీద crowdfunded ప్రవేశపెట్టింది.
How Does It Work?
సంస్థ తయారు చేసిన కొన్ని ఆవిష్కరణ ఉత్పత్తులను సంస్థ నిర్దేశించిన మేరకు మార్కెట్లో ఉంచుతుంది.ఈ ఉత్పత్తుల మీద వినియోగదారుల నుంచి స్పందన వచ్చినట్లయితేనే ఉత్పత్తుల అమ్మకాలు చేస్తామని, లేనిపక్షంలో వినియోగదారుడు చెల్లించిన నగదు తిరిగి చెల్లిస్తామని ఒప్పందంలో భాగంగా ఇది పనిచేస్తుంది.

Mi Crowdfunding

Mi Crowdfunding

How Will ‘Mi Crowdfunding' Help You?
ఈ ఉత్పత్తులపై సంస్థ కొన్ని అంచనాలను ప్రవేశపెడుతుంది. నిర్దేశిత సమయంలో వినియోగదారుల నుంచి దానిపై సరైన స్పందన రాకుంటే దాన్ని తయారు చేయడం కంపెనీ ఆపేస్తుంది. ఆ ఉత్పత్తి ఇంతకుముందు కస్టమర్లు ఎవరైతే కొన్నారో వారికే తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.
Which Products Are Available?
దీనిలో భాగంగా రూ.999 విలువైన బ్లూటూత్‌ ఆడియో రిసీవర్‌ (వైట్‌), రూ. 1,099 విలువైన సెల్ఫీ స్టిక్‌ ట్రైపాడ్‌ (బ్లాక్‌)ను భారత్‌లో అదుబాటులోకి తీసుకొచ్చింది.

 Mi Crowdfunding
 

Mi Crowdfunding

Where Will The Products Be Manufactured?
ఇప్పుడు కేవలం ఇండియాలో మాత్రమే ఈ Mi Crowdfunding లభిస్తోంది. అలాగే చైనాలో ఎప్పటి నుంచో ఈ Mi Crowdfunding అందుబాటులో ఉంది. కాగా ఈ పోగ్రాంను ఇండియాలో కంపెనీ అతి త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
When Will More Products Get Listed?
ప్రతి మూడు నాలుగు నెలలకొకసారి కంపెనీ తన కొత్త ఉత్పత్తులను అందుబాటులో ఉంచతుంది. ఇప్పటికే షియోమి Mi Fan Festival పేరిట ఇండియాలో ఓ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సేల్ లో భాగంగా ఎంపిక చేసిన ఉత్పత్తులపై కొన్ని రకాల డిస్కౌంట్లను అందిస్తోంది.

Upcoming Products

Upcoming Products

ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, పవర్‌ బ్యాంక్స్‌, మొబైల్‌ ఉపకరణాల వంటి ఉత్పత్తుల విక్రయాలతో భారత్‌లో షియోమీ మంచి మార్కెట్‌ను సొంతం చేసుకుంది. వీటిపై కూడా కంపెనీ ఈ Crowdfunding పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉత్పత్తల విక్రయాలు జరగడమే కాకుండా..

ఉత్పత్తల విక్రయాలు జరగడమే కాకుండా..

చైనాలో ప్రస్తుతం హార్డ్‌వేర్‌ స్టార్టప్ సంస్థలు తమ ఉత్పత్తులను ఈ క్రౌడ్‌ఫండింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయిస్తోన్నాయి. కేవలం ఉత్పత్తల విక్రయాలు జరగడమే కాకుండా స్టార్టప్ సంస్థలు ఆర్థికంగా పురోగమించేందుకు తోడ్పాటునిస్తోంది ఈ ప్లాట్‌ఫాం. ఐవోటీకి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే స్టార్టప్ సంస్థల్లో ఇప్పటికే షియోమీ భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం విదితమే.

Best Mobiles in India

English summary
7 Things You Need To Know About Xiaomi’s Mi Crowdfunding In India! More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X