ఫోన్ కోసం కిడ్నీ అమ్మిన ఘనుడు

Posted By:

అభిమానమన్నది మనసులో ఒక్కసారి బలంగా నాటుకుపోతే చాలు, అది మనిషిని ఎంతటివరకైనా తీుసుకువెళుతుంది. అభిమానులు లేని బ్రాండ్ అంటూ ఈ లోకంలో ఉండదు. జాతీయ బ్రాండ్‌ల మొదలుకుని అంతర్జాతీయ బ్రాండ్‌ల వరకు బ్రాండ్‌కు తగ్గట్టుగా వారికి అభిమాన సంఘాలు ఉంటాయి. ఆయా బ్రాండ్‌ల పట్ల అభిమానులు తమదైన రీతిలో ఇష్టాన్ని తెలుపుతుంటారు. ఇలాంటి పైత్యమే స్మార్ట్‌ఫోన్‌ల విషయంలోనూ నెలకుంది. యాపిల్ ఐఫోన్‌ల పై వెర్రెక్కిన అభిమానంతో పలువురు తమ జీవితాలను పణంగా పెట్టిన వైనం ఆసక్తినిరేకెత్తిస్తోంది.

ఇంకా చదవండి: 10 సంవత్సరాల క్రితం విడుదలైన విప్లవాత్మక మొబైల్ ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు చెందిన ఓ జంట ఐఫోన్‌లను కొనుగోలు చేసేందుకు తమ బిడ్డలను అమ్మకానికి పెట్టింది.

కొత్త ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ కోసం ఓ కుర్రవాడు తన కిడ్నిని అమ్ముకున్నాడు.

యాపిల్ ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలన్న తపనతో ఓ మహిళ క్యూలో తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు తన 2000 డాలర్ల హ్యాండ్ బ్యాగ్‌ను ఇచ్చేసింది.

తన కొడుకు ఐఫోన్‌ను వెతికిపట్టుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి తన క్రింద పని చేసే 10 మంది పరిశోధకులను పురమాయించడం ఓ సంచలనమైంది.

జపాన్‌కు చెందిన ఓ యాపిల్ అభిమాని ఐఫోన్‌ను ముందుగా దక్కించుకునే క్రమంలో యాపిల్ స్టోర్ వద్ద 7 నెలల ముందు నుంచే తిష్టవేసుకు కూర్చున్నాడు.

ఇంగ్లాండ్‌కు చెందిన ఓ టీనేజర్ డ్రెయిన్‌లో పడిపోయిన తన ఐఫోన్‌ను వెతికిపట్టుకునే క్రమంలో డ్రెయిన్‌లో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ సిబ్బంది కొన్ని గంటల పాటు బాధితురాలిని రక్షించాల్సి వచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Things You Won't Believe Crazy Fanboys Have Done To Afford An iPhone. Read More in Telugu Gizbot.....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot