Home
News

BoAt Data breach 75 లక్షల మంది పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు లీక్‌.. డార్క్‌ వెబ్‌లో..!

భారీ స్థాయిలో డేటా లీక్‌ అయింది. ఈ మేరకు ఫోర్బ్స్‌ ఇండియా కీలక వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 7.5 మిలియన్‌ మంది బోట్‌ వినియోగదారుల డేటా (BoAt Data breach) ప్రస్తుతం డార్క్‌ వెబ్‌లో ఉందని తెలిపింది. బోట్‌ సంస్థ స్మార్ట్‌వాచ్‌, ఆడియో ఉత్పత్తుల తయారీతో పాపులర్‌ బ్రాండ్‌గా ఉంది.

ఈ లీక్‌ అయిన డేటాలో పేర్లు, అడ్రస్‌, కాంటాక్ట్‌ నంబర్‌, ఈమెయిల్‌, కస్టమర్‌ ఐడీ వంటి వివరాలున్నాయని తెలుస్తోంది. ఈ డేటా లీక్‌ గురించి హ్యాకర్‌ ShopifyGUY ఏప్రిల్‌ 5న ధ్రువీకరించారు. బోట్‌ ఉత్పత్తుల వినియోగదారులు కొంత మంది నుంచి కూడా ఈ డేటా లీక్ ధ్రువీకరించబడింది. పబ్లిక్‌ డొమైన్‌లో దొరికిన డేటాతోపాటు బోట్‌ సర్వర్‌ నుంచి దొంగిలించబడినట్లుగా తెలుస్తోంది.

75 lakhs boat users data leaked

డేటా లీక్‌ కారణంగా ఆర్థిక మోసాలు సహా ఫిషింగ్‌ దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అనధికార లావాదేవీలు లేదా క్రెడిట్‌ స్కోర్‌ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ డేటాలో ప్రస్తుతం ఈ డేటా లీక్‌ వెలుగులోకి రావడంతో భద్రతా లోపాలను పరిష్కరించేందుకు మరియు కస్టమర్ల సమాచారాన్ని సురక్షితంగా ఉంచే విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని తెలుస్తోంది. అయితే బోట్‌ అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది.

ఈ డేటా లీక్‌పై థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు సౌమయ్‌ శ్రీవాస్తవ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్‌ ఇంజినీరింగ్ దాడులు, బ్యాంకు ఖాతాల అనధికార యాక్సెస్‌, మోసపూరిత లావాదేవీలు మరియు క్రెడిట్‌ కార్డు వివరాలను దుర్వినియోగం చేసేందుకు ఈ వ్యక్తిగత సమాచారం ఉపయోగించవచ్చని అనుమానించారు.

బోట్‌ సంస్థ తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా బృందం వ్యవస్థాపకుడు యష్‌ కడకియా అన్నారు. దీనిపై బాధితులు అందరికీ తెలియజేయాలని, మరియు ఈ లీక్‌పై పూర్తిస్థాయిలో పరిశోధన జరగాలని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.

** గత వారం బోట్‌ ఇయర్‌బడ్స్‌ యాడ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆపిల్‌ పేరు చెప్పకుండానే కొన్ని పదాల ద్వారా నేరుగా ఆపిల్‌ను టార్గెట్‌ చేసింది. ప్యాన్‌ బాయ్‌గా కాకుండా బోట్‌ హెడ్‌గా ఉండాలని క్యాప్షన్‌ ఇచ్చింది. భారతీయ సంస్థలను ప్రోత్సహించాలని కోరింది. అయితే ఈ వీడియో కాస్త వైరల్‌ అయింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు.

యాడ్‌లో ఎక్కడా ఆపిల్‌ సంస్థను ప్రస్తావించకుండానే ఐ, ప్రో, మ్యాక్స్‌ వంటి పదాలను ఉపయోగించింది. ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ నుంచి BoAt ఉత్పత్తులకు మారాలని కోరింది. అయితే ఈ యాడ్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయింది. నెటిజన్లు మిక్సిడ్‌ రివ్యూలను ఇచ్చారు. కొందరు బోట్‌ యాడ్‌ను మెచ్చుకుంటున్నారు. అదే మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

ఈ వీడియో ఆధారంగా దిగ్గజ సంస్థలకు పోటీగా బోట్‌ సంస్థ నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుందని అర్థం అవుతుంది. మరియు భారతీయ సంస్థలను ప్రోత్సహించాలని కోరినట్లు కనిపిస్తోంది. ఫ్యాన్‌ బాయ్‌ గా ఉండొద్దని.. బోట్‌హెడ్‌ గా ఉండాలంటూ వీడియోలో చివరిగా కామెంట్‌ వినిపించింది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. బోట్‌ ఆవిష్కరణలు, క్రియేటివిటీని సపోర్టు చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం విమర్శలు చేస్తున్నారు. బోట్‌ ప్రకటన కేవలం మార్కెటింగ్‌ జిమ్మిక్‌ మాత్రమేనని విమర్శలు చేస్తున్నారు. బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకోవడంలో తప్పులేదని అయితే ఫీచర్లు ఇతర అంశాలతో బ్రాండ్‌లతో పోటీపడాలని సూచించారు.

More from GizBot

Best Mobiles in India

English summary
75 lakhs boat users data leaked and available in dark web
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X