ప్రతీ గ్రామానికి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్!

|

దేశంలోని ప్రతీ గ్రామానికి బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించే లక్ష్యంతో 7,50,000 కిలో మీటర్ల మేర కేబుల్‌ను ప్రతిపాదించినట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వచ్చే మూడున్నర సంవత్సరాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు. ప్రజల్లో డిజిటల్ సాధికారతను పెంపొందించే లక్ష్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ గ్రామీణ భారతం రూపురేఖలనే మార్చేస్తుందన్న అంచనాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.

ప్రతీ గ్రామానికి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.3 లక్షల గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంది. మార్చి 2017 నాటికి 2.5 లక్షల గ్రామలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను విస్తరింపచేసేందుకు ప్రభుత్తం సన్నాహాలు చేస్తోంది.

భారత దేశాన్ని డిజిటల్ ఇండియాగా మారుస్తామంటూ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన వాస్తవ రూపాన్నిఅద్దుకోబోతోంది. ‘ఈ-క్రాంతి' అనే భారీ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. రూ.1,13,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ‘ఈ-క్రాంతి' ప్రాజెక్ట్ యూవత్ భారతావనిని ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ యుగంలోకి తీసుకువెళ్లుతోందనే ధీమా వ్యక్తమవుతోంది. ఈ-క్రాంతి పథకంలో భాగంగా ఈ-పాలన, ఈ-విద్య, ఈ-వాణిజ్యం, ఈ-బ్యాకింగ్, ఈ-వైద్యం వంటి అంశాలు దేశంలోని ప్రతీ గ్రామానికి విస్తరిస్తాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
750,000 km of cable to connect all villages with broadband. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X