ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఆన్‌లైన్‌ గేమ్స్‌: 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌

Posted By: Super

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఆన్‌లైన్‌ గేమ్స్‌: 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌

ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ క్యాజువల్‌ గేమ్స్‌కు రోజురోజుకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన 7సీస్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ తాజాగా ‘సోషల్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫాం’ను అందు బాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌ క్యాజువల్‌ గేమ్స్‌ను అందిస్తున్న www. neodelight.com, www. onlinerealgames.com లలో సోషల్‌ గేమింగ్‌ ప్లాట్‌ ఫాంను ఏర్పాటు చేసింది. బిజినెస్‌ ఇన్‌సైట్స్‌ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇటీవల సోషల్‌ గేమ్స్‌ను ఎంజాయ్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

ఆ రిపోర్టు ప్రకారం సోషల్‌ గేమింగ్‌ మార్కెట్‌ 2010 నాటికి 1.5 బిలియన్‌ డాల ర్లుగా ఉండగా 600మి లియన్ల మంది యూజర్లు సోషల్‌ గేమ్స్‌ను ఆడుతున్నట్లు వెల్లడైంది. సోషల్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా ఎవరైనా ఆన్‌లైన్‌లో సులువుగా గేమ్స్‌ను ఆడుకోవడంతో మాత్రమే కాకుండా కామెంట్ చేసే వెసులుబాటు కూడా ఇందులో కల్పించారు. ఎదుటి వారికి ఆటల్లో ఉన్న ఆసక్తిని ఛాలెంజ్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. స్నేహితులతో తమ అనుభవాలను పంచుకోవచ్చు. స్నేహితులను ఆహ్వానించడంతోపాటు వారిని జట్టులో కలుపుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ వినియోగదారులు పెరుగుతుండడంతో వారందరికీ ఆన్‌లైన్‌ క్యాజువల్‌ గేమ్స్‌ను అందరికి అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా www. neodelight. com, www. onlinerealgames.com లలో నేరుగా లాగిన్‌ అయి సోషల్‌ గేమింగ్‌ ఫీచర్స్‌‌తో ఎంజాయ్ చేయవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot