యూట్యూబ్‌ను మూసివేస్తున్నట్లు ట్విట్టర్‌లో అలజడి..?

Posted By:

 యూట్యూబ్‌ను మూసివేస్తున్నట్లు ట్విట్టర్‌లో అలజడి..?
గత కొన్ని సంవత్సరాలుగా ఓ మోసపూరిత సంప్రదాయం టెక్ ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఏప్రిల్ 1 వస్తుందంటే చాలు అనేక పుకార్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఫూల్స్ డేను పురస్కరించుకుని ‘యూట్యూబ్ మూసివేయబడుతుందంటూ' పలువురు ట్విట్టర్‌లో సృష్టించిన అలజడి అభిమానులను గందరగోళానికి గురి చేసింది.

అసలు విషయం ఏంటంటే..?

గూగుల్ ఇంకా యూట్యూబ్‌లు సంయుక్త ఆధ్వర్యంలో ‘యూట్యూబ్ ఈజ్ షట్టింగ్ డౌన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్'(YouTube is shutting down after 10 years) పేరుతో ఓ సరికొత్త వీడియోను ఏడాది ఆరంభంలో మార్కెట్లో ఆవిష్కరించాయి. ప్రపంచంలోని అత్యుత్తమ వీడియోను ఎంపిక చేసే ఉద్దేశ్యంతో యూట్యూబ్ ఈ కాన్సెప్ట్‌కు తెరలిపినట్లు తెలుస్తోంది. విజేతలకు బహుమతులను కూడ ప్రకటించింది.

అయితే ఈ అంశాన్ని పలువురు వక్రీకరించి ఇలా జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేసారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot