సత్య నాదెళ్లను హత్తుకున్న 8 ఏళ్ల బాలుడి ఆలోచన

Written By:

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల తన భారత పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో భేటి అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ 8 సంవత్సరాల గేమింగ్ డెవలపర్ టెక్నాలజీని పర్యావరణ సమతుల్యతలతో సంతులనం చేస్తూ తన విజన్‌ను వెల్లడించిన తీరు సత్య నాదెళ్లను ఎంతో ఆకట్టుకుంది.

సత్య నాదెళ్లను హత్తుకున్న 8 ఏళ్ల బాలుడి ఆలోచన

విద్యార్థి పారిశ్రామిక ఔత్సాహికులతో మైక్రోసాఫ్ట్ సీఈఓ భేటీ అయిన సందర్భంగా ముంబైకు చెందిన మిదాన్ష్ మెహతా (8), తాను అభివృద్థి చేసిన 'లెట్ దేర్ బీ లైట్' గేమింగ్ యాప్‌ను చూపించి దాని ఉద్ధేశ్యాన్ని సత్య నాదెళ్లకు వివరించాడు. మెహతా ఆలోచనకు మంత్ర ముగ్దులైన సత్య నాదెళ్ల తన కీలక ప్రసంగలో భాగంగా ఈ బాలుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ ప్రసంగంలోని ప్రధాన హైలెట్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : 4జీబి ర్యామ్‌‍తో లెనోవో ZUK Z2, ధర ఎంతంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సత్య నాదెళ్లను మెప్పించిన 8 ఏళ్ల బాలుడి దార్శినికత

‘నేను ఎనిమిదేళ్ల బాలుడిని కలిసాను. ఇంత చిన్న వయస్సులోనే అతడు తన ఆలోచనా విధానాన్ని ఉన్నత స్థాయిలో పెంపొందించుకున్నాడు. అతని వయస్సులో నేను సమయాన్ని అంతగా వినియోగించుకోలేకపోయాను' అని ఆ బాలుడిని ఉద్ధేశ్యించి మాట్లాడారు.

సత్య నాదెళ్లను మెప్పించిన 8 ఏళ్ల బాలుడి దార్శినికత

‘టెక్నాలజీని పర్యావరణ సమతుల్యతతో సంతులనం చేస్తూ అభివృద్ధి బాటలో సమాజాన్ని ముందుకు నడిపించాలన్న అతని ఆశయం స్ఫష్టంగా ఉంది. ఈ అంశం పైనే ఇతడు గేమ్‌ను డిజైన్ చేసాడని' సత్య నాదెళ్ల వివరించారు.

 

సత్య నాదెళ్లను మెప్పించిన 8 ఏళ్ల బాలుడి దార్శినికత

అతను తన ‘లెట్ దేర్ బీ లైట్' గేమ్‌లో, ప్రధానంగా పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతకు సంబంధించిన అంశాలు ప్రతిభింబిచేలా దృష్టి సారించాడు. ఈ గేమ్‌లోని ప్లేయర్లు  ఫ్యాక్టరీలతో పాటు సిటీలను నిర్మించాల్సి ఉంటుంది.

 

సత్య నాదెళ్లను మెప్పించిన 8 ఏళ్ల బాలుడి దార్శినికత

ఇదే సమయంలో వ్యవసాయ క్షేత్రాలతో పాటు పర్యావరణంపైనా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. గాలిని కూడా కలుషితం చేయకూడదు.

సత్య నాదెళ్లను మెప్పించిన 8 ఏళ్ల బాలుడి దార్శినికత

అంతేకాకుండా, పునరుత్పాదక శక్తులైన సోలార్, విండ్ ఎనర్జీలను వినియోగించుకునే అంశాల పై ఆలోచించాల్సి ఉంటుంది' అని మెహతా అభివృద్ధి చేసిన గేమ్ ప్రధాన ఉద్దేశ్యాన్నిసత్యా నాదెళ్ల ప్రశంసించారు.

 

సత్య నాదెళ్లను మెప్పించిన 8 ఏళ్ల బాలుడి దార్శినికత

దే కార్యక్రమంలో భాగంగా మెహతా, సత్య నాదెళ్లల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి.

సత్య నాదెళ్లను మెప్పించిన 8 ఏళ్ల బాలుడి దార్శినికత

తాను రానున్న కాలంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ కావాలంటే ఏం చేయాలని మెహతా.. సత్యా నాదెళ్లను అడిగాడు. దీనికి సమాధానంగా 'ఇప్పటికే నీవు నీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నావ్. తప్పకుండా ఆ స్థాయికి నీవు ఎదుగుతావ్' అని నాదెళ్ల బదులిచ్చారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 year old developer Impresses Satya Nadella with his Game. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot