పాకిస్తాన్ పిల్లోడు.. ప్రపంచానికి షాకిచ్చాడు!

Posted By: Prashanth

పాకిస్తాన్ పిల్లోడు.. ప్రపంచానికి షాకిచ్చాడు!

 

లండన్: పాకిస్తాన్‌కు చెందిన 8 సంవత్సరాల బాలుడు ‘షఫే తోబానీ’ మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ల విభాగంలో పిన్నవయస్కుడైన నిపుణుడిగా గుర్తింపుతెచ్చుకున్నాడు. తోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో దీక్షబూని ‘ఇంటర్నెట్ ప్రోటోకాల్ అండ్ డొమెయిన్ నేమ్ సిస్టమ్స్’ వంటి ప్రోగ్రామింగ్ అంశాల పై పూర్తి స్థాయి పట్టు సాధించిన షఫే, క్లిష్టమైన పరీక్షలను సమర్థవంతగా ఎదుర్కొని 91శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాడు.

కొడకు సాధించిన ఘనత పట్ల తండ్రి షా తోబానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షఫే చాలా చురుకైనవాడని, క్లిష్టమైన లెక్కలను సైతం కాలిక్యులేటర్ సాయంతీసుకోకుండా సెకన్ల వ్యవధిలో లెక్కగట్టేస్తాడని పొగడ్తలతో ముంచెత్తాడు. తన ముందు ఎప్పుడు కొత్త సవాళ్లను ఉంచేవాడినని వాటిని సమర్థవంతంగా షఫే అధిగమించేవాడని షా తెలిపారు.

షఫే నాలుగు సంవత్సరాల వయసు నుంచే కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి కనబర్చే వాడు, వృత్తి రిత్యా తండ్రి టెక్నాలజీ విభాగానికి చెందిన వాడు కావటంతో షఫేకు ప్రోత్సాహం మరింత పెరిగింది. కంప్యూంటింగ్ సంబంధిత కోర్సులను నేర్చుకునేందకు షఫే రోజుకు ఐదు గంటలు కేటాయించేవాడు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot