మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
ప్రపంచ అగ్రగామి సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కు చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)గా మన తెలుగు తేజం సత్య నాదెళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన తెలుగువారందరికి ఈ విషయం ఎంతో గర్వకారణం. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన నాదెళ్ల వివిధ విభాగాల్లో పనిచేస్తూ వచ్చారు. మైక్రోసాఫ్ట్ కంపెనీకి 39 సంవత్సరాల చరిత్ర ఉంది. కంపెనీ మొదటి సీఈఓగా బిల్ గేట్స్ వ్యవహిరించారు. రెండువ సీఈఓగా స్టీవ్ బాల్మర్ విధులు నిర్వహించారు. మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సత్యనాదెళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూసేద్దాం...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
బాల్యం, విద్యాభ్యాసం
సత్య నాదెళ్ల 1967లో హైదరాబాద్‌లో జన్మించారు. హైదారాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన సత్య నాదెళ్ల ఆ తరువాత ఎంఎస్ కోసం అమెరికాలోని విన్‌కాసిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. సత్య నాదెళ్ల స్వస్థలం అనంతపురం జిల్లాలోని బుక్కాపురం గ్రామం.

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
తండ్రి ఐఏఎస్ అధికారి
సత్యనాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ 962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా.. ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
మైక్రోసాఫ్ట్‌తో అనుబంధం
సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్ విండస్ డెవలప్‌మెంట్ విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేసారు. 1999లో మైక్రోసాఫ్ట్ బీసెంట్రల్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా, 2001లో మైక్రోసాఫ్ట్ బిజెనెస్ సొల్యూషన్స్ విభాగానికి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా, 2007లో ఆన్‌లైన్ సేవల విభాగానికి సీనియర్ ఉప్యాధ్యక్షుడిగా, 2011లో మైక్రోసాఫ్ట్ సర్వర్ అండ్ టూల్స్ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలందించారు. 2014లో ఏకంగా కంపెనీ సీఈఓ బాధ్యతలను స్వీకరించి ఆ పదవిని సమర్థవంతంగా
నిర్వహిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్‌ప్రైస్ బిజినెస్‌ను అభివృద్థి చేయటంలో సత్య నాదెళ్ల కీలక పాత్ర పోషించారు. భవిష్యత్త్ ప్రపంచ టెక్నాలజీగా భావిస్తున్న 'క్లౌడ్' (ప్రత్యేకంగా 'అజూర్')పై సత్య నాదెళ్లకు పూర్తి పట్టుంది.

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
సాంకేతిక విభాగంలో ఉన్నత చదువులు చదివిన సత్య ఎంబీఏ కూడా చదవడం మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా ఎదగడాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలి. పుస్తకాలు చదవడం, ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయడంపై సత్య ఆసక్తి చూపుతుంటారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండకపోతే గొప్ప పనులు చేయలేమన్నది ఆయన విశ్వాసం.

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
సత్య నాదెళ్లకు క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడటమే నాకు అన్నీ నేర్పిందని చెబుతుంటారు సత్య. పాఠశాల జట్టులో అతను ఆడుతూ వచ్చాడు. జట్టుతో కలిసి పనిచేయడం క్రికెట్ ఆడడం వల్ల నేర్చుకున్నానని, జీవితమంతా తనకు నాయకత్వం ఉందని సత్య నాదెల్ల అన్నారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
సత్య నాదెళ్ల తన హైస్కూల్ స్నేహితురాలు అనుపమను వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. వాషింగ్టన్‌లో స్థిర నివాసం

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
సత్య నాదెళ్ల ఏకాగ్రత మొత్తం మైక్రోసాఫ్ట్ అభివృద్థి పైనే...

మైక్రోసాఫ్ట్ సీఈఓ.. 10 ఆసక్తికర వాస్తవాలు
సత్యనాదెళ్ల చేసే ప్రసంగాలు నేటి యువతకు ఎంతో స్పూర్తినిస్తాయి.


Click it and Unblock the Notifications