ఆండ్రాయిడ్ 9 వచ్చేసింది, హైలెట్ ఫీచర్లు తెలుసుకోండి

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ 9.0 పి (P)' ని విడుదల చేసింది.

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ 9.0 పి (P)' ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంకు 'పై (Pie)' అని నామకరణం చేసింది. కాగా ఇందులో అనేక కొత్త ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి.ఆండ్రాయిడ్ ఓరియో కన్నా మెరుగైన ఫీచర్లు ఇందులో లభ్యమవుతున్నాయి. అయితే ఈ ఆండ్రాయిడ్ 9 పై అప్ డేట్ ను ముందుగా గూగుల్ పిక్సల్ స్మార్ట్ ఫోన్ యూజర్లు పొందనున్నారు. ఆ తరువాత ఇతర కంపెనీల డివైస్ లకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఉన్న ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

బ్యాటరీలు పేలేది అప్పుడే, ఆ బలహీన సమయాన్ని వదిలేయండిబ్యాటరీలు పేలేది అప్పుడే, ఆ బలహీన సమయాన్ని వదిలేయండి

అడాప్టివ్ బ్యాటరీ

అడాప్టివ్ బ్యాటరీ

బ్యాటరీ బ్యాకప్ కోసం ఈ ఓఎస్ లో ప్రత్యేక శ్రధ్ధ తీసుకున్నారు. ఆండ్రాయిడ్ పి ఓఎస్ ఉన్న డివైస్‌లలో మెషిన్ లెర్నింగ్ సహాయంతో బ్యాటరీ పనిచేస్తుంది. యూజర్లు ఎక్కువగా వాడే యాప్‌లను ఓ వైపు, ఎక్కువగా వాడని యాప్‌లను మరోవైపు బకెట్లనే గ్రూపులుగా విభజించి ఇనాక్టివ్‌గా ఉండే యాప్‌లకు బ్యాటరీ పవర్‌ను నియంత్రించేలా బ్యాటరీ ఫీచర్‌ను డెవలప్ చేశారు.

సిస్టమ్ నావిగేషన్

సిస్టమ్ నావిగేషన్

ఆండ్రాయిడ్ పిలో సిస్టమ్ నావిగేషన్ గెస్చర్లను పూర్తిగా మార్చివేశారు. సింగిల్ హ్యాండ్‌తో హోమ్ స్క్రీన్, యాప్ స్క్రీన్, ఇతర విండోలకు స్క్రోల్ అయ్యే విధంగా ఓఎస్‌ను డిజైన్ చేశారు. ఒకటి కన్నా ఎక్కువ యాప్‌లను ఓపెన్ చేసి మల్టీ టాస్కింగ్ చేసుకునే యూజర్లకు అనువుగా ఉండేలా సిస్టమ్ నావిగేషన్‌ను మార్చారు.

ఏఐ పవర్డ్ యాప్ యాక్షన్స్

ఏఐ పవర్డ్ యాప్ యాక్షన్స్

ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోని యాప్స్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే విధంగా ఉండనున్నాయి. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పడు దానికి సంబంధించిన కమాండ్ ను ముందుగా నిర్దేశించుకోవచ్చు. ఉదాహరణకు హెడ్‌ఫోన్స్ పెట్టుకోగానే మ్యూజిక్ ప్లేయర్ లేదా సాంగ్స్ యాప్ ఓపెన్ అవ్వాలని ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటే ఇకపై ఎప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా అదే యాప్ ఓపెన్ అవుతుంది.

 స్లైసెస్

స్లైసెస్

వేగవంతమైన సమాచారం కోసం ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. యూజర్‌కు తాను వెదకాలనుకున్న సమాచారం వేగంగా దొరకడమే కాక, తన పని కూడా సులభమయ్యేలా రూపొందించారు. ఉదాహరణకు మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకుంటే దానికి సంబంధించిన రైడ్ వివరాలు, ఇతర వివరాలు అన్నీ ఓ చోట లభిస్తాయి.

 బ్యాక్‌గ్రౌండ్ రిస్ట్రిక్షన్స్

బ్యాక్‌గ్రౌండ్ రిస్ట్రిక్షన్స్

మొబైల్ బ్యాటరీని ఆదా చేసుకునేందుకు గాను యాప్స్‌ను నిర్దిష్ట సమయం పాటు ఈ ఫీచర్ ద్వారా రిస్ట్రిక్ట్ చేయవచ్చు. అందుకు తగినవిధంగా కాలపరిమితిని యూజర్ సెట్ చేసుకోవచ్చు. దీంతో డివైస్ బ్యాటరీ ఎంతో సేవ్ అవుతుంది. అలాగే అవసరం లేని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే వాటిని పూర్తిగా నియంత్రించే ఏర్పాటు చేశారు.

వెరిఫై పర్చేస్

వెరిఫై పర్చేస్

గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులు కొనుగోలు చేసే యాప్స్, గేమ్స్, బుక్స్, సినిమాలు తదితర కంటెంట్‌కు పర్చేస్ వెరిఫికేషన్‌గా ఫింగర్‌ప్రింట్, ఐరిస్‌ను పెట్టుకోవచ్చు. దీంతో ఆయా కంటెంట్‌ను కొనుగోలు చేసే ముందు బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను యూజర్ ఇవ్వాలి. అలా ఇస్తేనే ఆ కంటెంట్‌ను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

రీడిజైన్ చేయబడిన క్విక్ సెట్టింగ్స్, వాల్యూమ్ కంట్రోల్స్, నోటిఫికేషన్స్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ రిప్లైస్, యూజర్లు ఎంత సమయం ఏయే యాప్‌లో గడిపారో తెలిపే నూతన తరహా డ్యాష్ బోర్డ్, చీకటి పడగానే ఆటోమేటిక్‌గా బ్రైట్‌నెస్‌ను అడ్జస్ట్ చేసే డు నాట్ డిస్టర్బ్ మోడ్ వంటివి ఈ ఓఎస్ లో అందుబాటులోకి రానున్నాయి.

గూగుల్‌కు చెందిన పిక్సల్ ఫోన్లకు

గూగుల్‌కు చెందిన పిక్సల్ ఫోన్లకు

ఆండ్రాయిడ్ 9.0 పి ఓఎస్ అప్‌డేట్ గూగుల్‌కు చెందిన పిక్సల్ ఫోన్లకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2, షియోమీ ఎంఐ మిక్స్ 2ఎస్, నోకియా 7 ప్లస్, ఒప్పో ఆర్15 ప్రొ, వివో ఎక్స్21, ఎక్స్21 యూడీ, వన్ ప్లస్ 6 తదితర ఫోన్లతోపాటు అన్ని ఆండ్రాయిడ్ వన్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 9.0 పి అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు.

ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) రూపంలో

ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) రూపంలో

ఈ డివైస్‌లను వాడుతున్న యూజర్లు తమ ఫోన్లలో ఉన్న ఓఎస్‌ను ఆండ్రాయిడ్ 9.0 పి కి అప్‌డేట్ చేసుకోవచ్చు. కొత్త సాఫ్ట్‌వేర్ యూజర్లకు ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) రూపంలో లభిస్తున్నది.

Best Mobiles in India

English summary
Android Pie: Everything you need to know about Android 9 more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X