ఐటీ సెక్టార్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ జాబ్ ఇదే?
2017-18 సంవత్సరానికి గాను సెక్యూరిటీ పరంగా అనేక ఒడిదుడుకులను ఐటీ సెక్టార్ ఎదుర్కోవల్సి వచ్చింది. డేటా లీక్స్, మాల్వేర్ త్రెట్స్ వంటి అంశాలు సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకునేలా చేసాయి.
2017-18 సంవత్సరానికి గాను సెక్యూరిటీ పరంగా అనేక ఒడిదుడుకులను ఐటీ సెక్టార్ ఎదుర్కోవల్సి వచ్చింది. డేటా లీక్స్, మాల్వేర్ త్రెట్స్ వంటి అంశాలు సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకునేలా చేసాయి.

సైబర్ దాడుల నేపథ్యంలో...
సైబర్ దాడుల నేపథ్యంలో చాలా వరకు ఐటీ కంపెనీలు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ను హైర్ చేసుకోవటం మొదలుపెట్టాయి. దీంతో వీరికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ నియామకాలు 2019లోనూ పెరిగే అవకాశముందని బీటీఐ ఎగ్జిక్యూటివ్ రిసెర్చ్ వెల్లడించింది. ఈ సెర్చ్ రివీల్ చేసిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ సగటు వార్షిక ప్యాకేజీ రూ.85 లక్షలుగా ఉంది...
బీటీఐ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ సగటు వార్షిక ప్యాకేజీ రూ.85 లక్షలుగా ఉంది. ఇదే సమయంలో చీఫ్ టెక్నికల్స్ ఆఫీసర్స్ ‘ వేతనం చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్‌తో పోలిస్తే 20శాతం ఎక్కువుగా ఉందట.

ఐటీ జాబ్స్‌తో పోలిస్తే సైబర్ సెక్యూరిటీ విభాగంలో...
ఐటీ జాబ్స్‌తో పోలిస్తే సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగాల సంఖ్య గడిచిన సంవత్సరం కాలంగా మూడు రెట్లు పెరిగిందని బీటీఐ లేటెస్ట్ రీసెర్చ్ చెబుతోంది. బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, కస్టమర్ ఓరియంటెడ్ ప్రోడక్డ్ అండ్ సర్వీసెస్ విభాగాలు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కోసం చూసున్నాయి.

ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కొరత ఉంది....
బీటీఐ లేటెస్ట్ స్టడీ ప్రకారం ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కొరత ఉంది. ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఈ కొరత ఎక్కువగా ఉంది. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, నెట్‌వర్క్స్, సెక్యూరిటీ ఫ్లాట్ ఫామ్స్ అలానే వర్చువల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్స్ డిపార్ట్‌మెంట్2లను చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ లీడ్ చేస్తున్నాయి. సాధారణంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అనే వారు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ లేదా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ కు రిపోర్ట్ చేయవల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








