మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

Posted By:

నేటి తరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బ్లూటూత్‌ను అవసరానికే ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈ అప్లికేషన్‌ను ఆన్ చేసి వదిలేస్తారు. బ్లూటూత్ రన్ అయ్యే సందర్భంలో ఎక్కువ శక్తి కావల్సి ఉంటుంది, కాబట్టి ఈ అప్లికేషన్‌తో పని పూర్తి కాగానే ఆఫ్ చెయ్యటం మర్చిపోవద్దు. మ్యూజిక్ లేదా వీడియోలను స్ట్రీమ్ చేయ్యటం, 3జీ కనెక్టువిటీ సాయంతో డేటాను డౌన్‌లోడ్ చెయ్యటం వంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరానికి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. బ్యాటరీలో పవర్ తక్కువుగా ఉన్నప్పుడు 3జీ కనెక్షన్‌ను ఆఫ్ చెయ్యటం మంచిది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ  తమ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ మేనేజిమెంట్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసుకోవటం వల్ల బ్యాటరీని మరింత ఆదాచేసుకోవచ్చు.  మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువ రోజులు పెంచుకునేందుకు 9 చిట్కాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

ఫోన్ లోకేషన్స్ సెట్టింగ్స్‌ను ఆఫ్ చేసి ఉంచటం ద్వారా ఫోన్ బ్యాటరీ శక్తిని ఆదా అవుతుంది.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

ఫోన్ స్ర్కీన్‌కు సంబంధించి బ్రైట్నెస్ లెవల్స్ ను తగ్గించుకోవటం ద్వారా ఫోన్ బ్యాటరీ శక్తిని ఆదా చేసుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

ఫోన్‌లో నిరుపయోగంగా ఉన్న అప్లికేషన్‌లను తొలగించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రోజులు వస్తుంది.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఏఏ అప్లికేషన్ ఎంతంత బ్యాటరీ శక్తిని వినియోగించుకుంటుందో పరిశీలించండి. వాటికి ఎక్కువ బ్యాటరీ శక్తిని వినియోగించుకుంటోన్న యాప్‌లను అవసరం లేదనుకుంటే టర్న్ఆఫ్ చేయండి.

 

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

ఫోన్ ఇంటర్నెట్ కోసం సాధ్యమైనంత వరకు వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

సాధ్యమైనంత వరకు మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను 2జీలోనే ఉంచుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్వాల్కమ్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి క్వాల్కమ్ బ్యాటరీ గురు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ మీ ఫోన్ సెట్టింగ్‌లను ఆప్టిమైజ్ చేసుకుని బ్యాటరీ ఆదాకు ప్రయత్నిస్తుంది.

 

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

ప్రతి 15 సెకన్ల తరువాత మీ ఫోన్ డిస్‌ప్లే స్లీప్ మోడ్‌లోకి వెళ్లే విధంగా డిస్‌ప్లే సెట్టింగ్స్‌ను మార్చుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కోసం 9 స్మార్ట్ చిట్కాలు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3, హెచ్‌టీసీ వన్ ఎం8, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 వంటి అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను మీరు  వినియోగిస్తున్నట్లయితే బ్యాటరీ సేవర్ సాఫ్ట్‌వేర్‌లను డివైస్‌లో తప్పనసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 tips to get better battery life out of your smartphone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot