‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు 95% ఇండియన్ ఇంజినీర్లు పనికిరారు’

ఇండియన్ ఐటీ అలానే డేటా సైన్స్ ఇకోసిస్టం విభాగాల్లో నైపుణ్యాల కొరత తీవ్రంగా వేధిస్తోందని ఓ సర్వే తేటతెల్లం చేసింది. ఆస్పైరింగ్ మైండ్స్ నిర్వహించిన సర్వే ప్రకారం 95% ఇండియన్ ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగాలకు అన్‌ఫిట్ అని తేలింది.

Read More : రూ.333తో రోజుకు 3జీబి డేటా, 90 రోజులు మీ ఇష్టం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4.77శాతం ఇంజినీర్లు మాత్రమే..

కేవలం 4.77శాతం ఇంజినీర్లు మాత్రమే ప్రోగ్రామింగ్‌కు అవసరమైన సరైన లాజిక్‌ను రాయగలుగుతున్నారని ఆస్పైరింగ్ మైండ్స్ చెబుతోంది.

 

36,000 ఇంజినీరింగ్ విద్యార్థుల పై..

500 కళాశాలల్లోని ఐటీ బ్రాంచ్‌లకు సంబంధించి 36,000 ఇంజినీరింగ్ విద్యార్థుల పై ఈ సర్వేను నిర్వహించారు. వీరంతా Automata అనే మెచీన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ డెవలెప్‌మెంట్ స్కిల్స్‌ను నేర్చుకున్న వారే.

1.4% మంది మాత్రమే సరైన కోడ్‌ను రాయగలుగుతున్నారు..

సర్వేలో మూడింట రెండింట మంది ప్రోగ్రామింగ్ కు అవసరమైన సరైన కోడ్‌ను కూడా రాయలేకపోయారట. కేవలం 1.4% మంది మాత్రమే సరైన కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేయగలిగారట. ప్రోగ్రామింగ్ విషయంలో ప్రపంచం మూడేళ్ల ముందుకు వెళ్ళిపోయిందని, దీనిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం భారత్‌‌కు ఉందని ఆస్పరింగ్ మైండ్స్ సీటీఓ సహ వ్యవస్థాపకుడు వరుణ్ గర్వాల్ అభిప్రాయపడ్డారు.

సర్వే తేల్చి చెప్పింది..

టైర్ 1 కళాశాలతో పోలిస్తే టైర్ 3 కశాశాలల్లో ప్రోగ్రామ్ నైపుణ్యాల కొరత 5 రెట్లు ఎక్కువగా ఉందని అగర్వాల్ చెప్పారు. టాప్ 100 కాలేజీల్లో 69 శాతం మంది విద్యార్థులు కంపైల్ చేసే ప్రోగ్రాంను రాయగలుగుతున్నారని, మిగతా కళాశాలల్లో ఈ సంఖ్య 31 శాతం మాత్రమే ఉందని ఆస్పైరింగ్ మైండ్స్ సర్వే తేల్చి చెప్పింది.

పరిశ్రమ ఆశిస్తోన్న నైపుణ్యాలు త్వరగా మారిపోతున్నాయి..

ఐటీ విభాగంలో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించినట్లయితే పరిశ్రమ ఆశిస్తోన్న నైపుణ్యాలు చాలా త్వరగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవల్సి ఉంది. ఐటీ పరిశ్రమ ఆశిస్తోన్న 10 మోస్ట్ వాంటెడ్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ను మీ దృష్టికి తీసుకువస్తున్నాం..

IT architecture

ఐటీ ఆర్కిటెక్షర్ 42% శాతం ఐటీ కంపెనీలు ఐటీ ఆర్కిటెక్షర్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

Programming/application development

40% శాతం ఐటీ కంపెనీలు ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను  హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

Project management

ప్రాజెక్ట్ మెనేజ్‌మెంట్

39% శాతం ఐటీ కంపెనీలు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

బిగ్ డేటా

39% శాతం ఐటీ కంపెనీలు బిగ్ డేటా నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను ఈ 2016లో హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

Business intelligence/analytics

34% శాతం ఐటీ కంపెనీలు బిజినెస్ ఇంటెలిజెన్స్/అనాలిటిక్స్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

హెల్ప్ డెస్క్/టెక్నికల్ సపోర్ట్

30% శాతం ఐటీ కంపెనీలు హెల్ప్ డెస్క్/టెక్నికల్ సపోర్ట్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

Database administration

25% శాతం ఐటీ కంపెనీలు డేటాబేస్ అడ్మిన్‌స్ట్రేషన్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

Cloud/SaaS

25% శాతం ఐటీ కంపెనీలు క్లౌడ్/సాస్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

Web development

24% శాతం ఐటీ కంపెనీలు వెబ్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలను కలిగి ఉన్న వ్యక్తలను  హైర్ చేసుకునేందుకు చూస్తున్నాయట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
95% engineers in India unfit for software development jobs: Report. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot