సొంత వెబ్‌సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?

Posted By: Staff

సొంత వెబ్‌సైట్ కావాలనుకుంటే ఏం చేయాలి?

సొంత సైట్ కోసం మనం చేయాల్సినవి మూడు పనులు:

సైట్ పేరు ఎంచుకోవడం
సైట్ పేరుని డొమైన్ లేదా సీమనామము అంటారు. ముందు మీ సైట్/బ్లాగ్ కి ఒక పేరు ఎంచుకోండి. తర్వాత మీరు ఆ సైట్ ఎందుకు వాడాలనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి దాని చివర .com, .in, .net, .ఆర్గ్, .info లాంటి వాటిల్లో ఏది ఎంచుకోవాలో చూసుకోండి. ఏది పెట్టుకున్నా పర్వాలేదు కానీ, కాస్త అర్థవంతంగా ఉంటే మంచిది కాబట్టి చూసి నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణకి అది మీ వ్యక్తిగాతమైతే మనది భారతదేశం కాబట్టి .in పెట్టుకోవచ్చు. అది ఒక e-commerce లాంటి కమర్షియల్ వాటి కైతే .com అని పెట్టుకోవచ్చు. స్వచ్చంద సంస్థల వంటివాటికి .org బావుంటుంది. సమాచారం అందరికి పంచే సైటైతే .info అని పెట్టుకోవచ్చు. .net అంటే ఇదివరకు నెట్వర్క్ కి సంబందించిన ఒక అర్థం ఉండేది కానీ, ఇప్పుడు ఆ అర్థంతో వాడుతున్నట్టేమి కనబడట్లేదు. కానీ, సైట్ అంటే .com యేనని మనసులో ముద్రపడిపోయింది చాలా మందికి. ఇప్పుడిప్పుడే అంతర్జాలం విస్తరిస్తున్న పల్లెల్లో ఈ భావన ఎక్కువ. కాబట్టి మీ సైట్ కి వచ్చేవారు ఎవరు అనేదాన్నిబట్టి కూడా చూసుకోవాలి.

ఆ పేరు రిజిస్టర్ చేయడం
ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలకైన తీసుకోవచ్చు. లేదా ఇక ఎప్పటికి ఆ పేరు మీదే అన్నట్టు కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కి చాలా సైట్లు ఉన్నాయ్. ఉదాహరణకి హోస్ట్.ac, గో డాడీ, రిజిస్టర్.కాం చూడండి. మిగతా వాటి కోసం గూగుల్ ని అడిగితే సరి. ఆ సైట్లలో ఏదైనా ఒకటి ఎంచుకుని అక్కడ మీరు అనుకున్న పేరు లభ్యత ఉందేమో చూసుకోండి. లేకపొతే ఇంకో పేరు ప్రయత్నించాలి. ఒకవేళ ఉంటే క్రెడిట్ కార్డు ద్వారానో, పేపాల్ ద్వారానో, మరే ఇతరమార్గం ద్వారానో ఆ పేరు కొనుక్కోవాలి. మామూలుగా అయితే సంవత్సరానికి .in తో ముగిసే పేర్లు 20 డాలర్లు దాకా ఉంటే, మిగతావన్నీ 10 డాలర్లు ఉంటాయి.

జాల జాగా కొనుక్కోవడం
ఇప్పుడు మీ సైట్ లో మీరు పెట్టాలనుకున్నవన్నీ పెట్టడానికి ఒక జాగా లేదా ఆవాసం కావాలి. మామూలుగానైతే మీరు ఎక్కడైతే ఆ పేరు కొన్నారో, వాళ్ళ దగ్గరే ఆవాసం కూడా కొనుక్కునే సౌలభ్యమ్ ఉంటుంది. కానీ మీ అవసరాన్ని బట్టి, మీరు ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నారో అన్నదాన్నిబట్టి వేరే చోట్ల కూడా వెతికిన తర్వాత నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణ కి g33k హోస్టింగ్, బ్లూ హోస్ట్, హోస్ట్.ac లాంటి ఆవాసదాతల్ని చూడండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot