Just In
Don't Miss
- Finance
అబ్బే.. ఇవి అందులోకి రావు: కార్పొరేట్ పన్ను తగ్గింపుపై షాక్ ఇచ్చిన ఆర్థిక మంత్రి!
- News
Encounter: బెత్తం దెబ్బలు కాదు గానీ: నేర స్థాయిని బట్టి అది మరణ శిక్ష అయినా సరే: పవన్ కల్యాణ్!
- Lifestyle
రేపిస్టులైన నలుగురిని ఎన్ కౌంటర్లో లేపేయడంపై పోలీసులకు థ్యాంక్స్ చెబుతూ ట్విట్టర్లో ట్వీట్ల మోత...
- Sports
'టీ20 ప్రపంచకప్ కోసం కొన్ని ఆలోచనలు ఉన్నాయి.. శాస్త్రి, కోహ్లీతో పంచుకుంటా'
- Movies
వెంకటేష్ సినిమాలో మరో హీరో.. టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న నట వారసుడు.!
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
Online Fraud: ఫుడ్ డెలివరీ కస్టమర్ కేర్ చేతిలో 4 లక్షలు స్వాహా
ఇండియాలో రోజు రోజుకి ఆన్లైన్ ద్వారా మోసపోయాము అన్న వార్తలు పెరుగుతున్నాయి. ఆర్బిఐ కూడా దీనిని మునుపటి కంటే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నది. ఇప్పుడు ఇలాంటి సంఘటన లక్నో ప్రాంతంలో మరొకటి జరిగింది. ఒక కొత్త సంఘటనలో ఆ వ్యక్తి ఆన్లైన్ కస్టమర్ కేర్ నుండి మోసానికి గురయ్యాడు. ఓ వ్యక్తి తన ఫుడ్ ఆర్డర్‌ను రద్దు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ మోసం జరిగింది.

వివరాలలోకి వెళ్తే గోమ్టినగర్ లోని విరాట్ ఖండ్ కు చెందిన అమన్ అనే వ్యక్తి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అప్లికేషన్ ఉపయోగించి తనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. అతను ఆహార నాణ్యత విషయంలో సంతోషంగా లేకపోవడం వలన అతను కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే అతను చాలా పెద్ద తప్పు చేసాడు. చాలా సార్లు చాలా మంది సూచించారు ఇంటర్నెట్లో కస్టమర్ కేర్ నంబర్ కోసం శోధించడం మానుకోవాలని. కానీ అతను అందరి లాగా కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయడంలో సాధారణ తప్పు చేశాడు.
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

ఆన్లైన్ మోసానికి ఒక వ్యక్తి రూ .4 లక్షలు కోల్పోయాడు
టైమ్స్ నౌ అందించిన సమాచారం ప్రకారం అమన్ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్ లో తనిఖీ చేసిన నెంబర్ నకిలీది అని తెలుసుకోవడానికి అతనికి కొద్ది సమయం మాత్రమే పట్టింది. మొదట అతను ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు ఫోన్ కాల్ స్వీకరించిన ఆ వ్యక్తి తనను తాను ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ యొక్క కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు.
Tata Sky Binge: ZEE5 సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై బింగే సర్వీస్

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అమన్‌ను ఒక అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసి తన బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అవ్వమని కోరినట్లు తెలిసింది. అమన్ అతని సూచనలను అనుసరించి తన బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆ యాప్‌లో నమోదు చేశాడు. వెంటనే అతను తన ఫోన్లో వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను అందుకున్నాడు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డబ్బును వాపసు పొందడానికి ఒటిపిలోకి ఎంటర్ చేయమని అమన్‌ను కోరినట్లు తెలిసింది. అమన్ ఆ సూచనలను అనుసరించిన తరువాత కొన్ని నిమిషాల్లో తన బ్యాంక్ అకౌంట్ నుండి రూ.4 లక్షలు ట్రాన్సఫర్ చేసినట్లుగా మెసేజ్ అందుకున్నాడు.
గ్లోబల్ 2019 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈసారి లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు అమన్‌ను ఒక యాప్‌ను డౌన్లోడ్ చేయమని కోరాడు. ఇది బాధితుడి ఫోన్ నంబర్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేయడానికి అనుమతించింది. అమన్ ఫోన్ నంబర్‌కు యాక్సిస్ పొందిన తరువాత నిందితుడు బ్యాంక్ అకౌంట్ నుండి రూ.4 లక్షలు ట్రాన్సఫర్ చేయగలిగాడు. ఆన్లైన్ ద్వారా మోసం చేసిన వ్యక్తిని గుర్తించడానికి సైబర్ సెల్ సహాయం తీసుకుంటున్నాము అని గోమ్టినగర్ SHO అమిత్ కుమార్ దుబే పత్రిక సమావేశంలో తెలిపారు.

గూగుల్ పే కస్టమర్ కేర్
దేశంలో ఆన్లైన్ ద్వారా మోసపోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ముంబైకి చెందిన 31 ఏళ్ల ఒక వ్యక్తి ఇలాగే రూ.96,000లు మోసపోయాడు. ఇతడిని మోసగించడానికి మోసగాడు తన నంబర్‌ను గూగుల్ పే కస్టమర్ కేర్‌గా పోస్ట్ చేసినట్లు తెలిసింది. లావాదేవీలో కొంత లోపం ఉన్నప్పుడు సమస్యను వివరించడానికి బాధితుడు ఆన్లైన్లో ఒక నంబర్‌ను కనుగొన్నాడు. నిందితుడు ఫిర్యాదుదారునికి కలెక్ట్ రిక్వెస్ట్ పంపించి దానిపై క్లిక్ చేయమని కోరాడు. దాని మీద క్లిక్ చేసినందుకు అతని అకౌంట్ నుండి 96,000 రూపాయలు బదిలీ అయ్యాయి. సైబర్ మోసగాళ్ళు ప్రజలను మోసగించడానికి కొత్త కొత్త మార్గాలను రూపొందిస్తున్నారు.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090