యాపిల్ స్పేస్‌షిప్‌లో డ్రోన్‌లు హల్‌చల్..?

Written By:

కనివిని ఎరగని రీతిలో యాపిల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న 50 బిలియన్ డాలర్ హెడ్ క్వార్టర్‌కు సంబంధించి ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. స్పేస్‌షిప్ తరహాలో ఉండే ఈ కొత్త క్యాంపస్ నిర్మాణ పనులను ప్రత్యేకమైన డ్రోన్‌ల ద్వారా సంస్థ సీఈఓ టిమ్ కుక్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : ఈమెయిల్ సృష్టికర్త ఇకలేరు

యాపిల్ స్పేస్‌షిప్‌లో డ్రోన్‌లు హల్‌చల్..?

డ్రోన్‌ల సహాయంతో ప్రముఖ వీడియోగ్రాఫర్ డంకన్ సిన్‌ఫీల్డ్ చిత్రీకరిస్తోన్నవిజువల్స్ ద్వారా తాజా పరిస్థితులను కుక్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని కుపర్టినో పట్టణంలో ఈ నిర్మాణం జరుగుతోంది. క్యాంపస్ నిర్మాణ పనులు పూర్తి అయినట్లయితే 12,000 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేసే వీలుంటుంది. ఆధునిక హంగులతో కూడిన ఫిట్నెస్ సెంటర్, 1000 మంది సీటింగ్‌తో కూడిన అండర్ గ్రౌండ్ ఆడిటోరియమ్, 11,000 పార్కింగ్ స్పాట్‌లు ఈ క్యాంపస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Read More : సిగ్నల్స్ వీక్‌ టైంలో కాల్ మాట్లాడటం ఎలా..?

English summary
A new drone video of Apple's spaceship campus. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot