'విండోస్ ఫోన్ టాంగో' ఆపరేటింగ్ సిస్టమ్‌కి కొత్త పేరు

Posted By: Prashanth

'విండోస్ ఫోన్ టాంగో' ఆపరేటింగ్ సిస్టమ్‌కి కొత్త పేరు

 

సాప్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ ఫిబ్రవరి నెల చివర జరిగిన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెసు 2012' కార్యక్రమంలో విండోస్ ఫోన్ టాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని విండోస్ విడుదల చేయడానికి గల కారణం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ఉత్పత్తుల ధరలను మరింతగా తగ్గించి, వినియోగదారుల ప్రెండ్లీ మొబైల్స్‌గా వీటిని తయారుచేయడం.

ఐతే మైక్రోసాప్ట్ కంపెనీ టాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌ని అధికారకంగా '7.5 రీఫ్రేష్' గా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆప్‌డేట్ చేస్తూ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్‌కి సరిపోయే విధంగా దీనిని రూపొందించారు. సాధారణంగా మైక్రోసాప్ట్ ఎప్పుడూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేసిన అది యూజర్స్ అభిరుచికి తగ్గట్టుగా ప్రెండ్లీగా ఉండేవిధంగా నిర్ణయాలు తీసుకుంటారు.

విండోస్ ఫోన్ రిఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి విడుదల తేదీని వెల్లడించకపోయినప్పటికీ.. చైనాలో మార్చి 21, 2012వ తారీఖున మైక్రోసాప్ట్ ప్రెస్ కాన్పరెన్స్‌కు నిర్వహించనున్నట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot