రూ.888కే స్మార్ట్‌ఫోన్, కొత్త కంపెనీ పక్రటన

Written By:

ఫ్రీడం 251 మొబైల్ స్కామ్ రేపిన అలజడి చల్లారక ముందే మరో కొత్త కంపెనీ రూ.888కే స్మార్ట్‌ఫోన్ అంటూ ముందుకొచ్చింది. జైపూర్‌కు చెందిన Docoss కంపెనీ రూ.888కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ హాట్ టాపిక్ అయ్యింది. Docoss X1 పేరుతో లభ్యంకానున్న ఈ ఫోన్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్స్ ఏప్రిల్ 29 వరకు జరగనున్నాయి. మే 2 నుంచి సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ చెబుతోంది.

Read More : యాపిల్ కంపెనీలో ఆ శవం ఎవరిది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + డబ్ల్యూసీడీఎమ్ఏ), జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

Docoss X1 గురించి మీరు తెలుసుకోవల్సిన ముఖ్యైమైన విషయాలు

Docoss X1 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.888గా ప్రకటించిన కంపెనీ అందులో ట్యాక్సులు కలపలేదు. కాబట్టి ఫోన్ వాస్తవ ధర అదికాదు.

 

Docoss X1 గురించి మీరు తెలుసుకోవల్సిన ముఖ్యైమైన విషయాలు

Docoss X1 స్మార్ట్‌ఫోన్ ముందస్తు బుకింగ్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయటం లేదు.

Docoss X1 గురించి మీరు తెలుసుకోవల్సిన ముఖ్యైమైన విషయాలు

ఫోన్ డెలివరీకి సంబంధించి ఖచ్చితమైన వివరాలను కంపెనీ వెల్లడించలేకపోతోంది.

Docoss X1 గురించి మీరు తెలుసుకోవల్సిన ముఖ్యైమైన విషయాలు

Docoss X1 జెన్యున్ ప్రొడక్టా లేకా ఫ్రీడమ్ 251 తరహాలో మరో కుంభకోణమా అనేది త్వరలోనే వెల్లడవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
A new smartphone for Rs 888 only! READ THIS before you buy it. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot