ఫేస్‌బుక్ మరియు వాట్సాప్ మెసేజ్లను యాక్సెస్ చేయడానికి పోలీసులకు అనుమతులు

|

ఫేస్‌బుక్ మరియు వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వారు దాచిపెట్టిన మెసేజ్ లను పోలీసులతో పంచుకోవలసి వస్తుంది. ఈ ఒప్పందం యుఎస్ మరియు యుకె మధ్య గల కొత్త ఒప్పందంలో భాగంగా వచ్చే నెలలో సంతకం చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం క్రిమినల్ నేరాలతో సంబంధం గల మరియు అనుమానించిన వ్యక్తులపై దర్యాప్తు చేయడానికి మద్దతుగా సమాచారాన్ని పంచుకోవడానికి యుఎస్ లోని సోషల్ మీడియా సంస్థలను బలవంతం చేస్తుంది.

పెడోఫిలియా

ఇందులో ఉగ్రవాదం మరియు పెడోఫిలియా ఉన్నాయి. ఈ టెక్ కంపెనీలు వినియోగదారుల మెసేజ్ లను షేర్ చేయమని బలవంతం చేస్తున్నప్పటికీ ఈ చర్య ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ యొక్క బలాన్ని తగ్గిస్తుందని అనిపించదు.

 

5G టెక్నాలజీ వాడకం ఇండియాలో ఎప్పుడు?5G టెక్నాలజీ వాడకం ఇండియాలో ఎప్పుడు?

ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్

ఫేస్‌బుక్ యొక్క ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ నేరస్థులకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుందని యుకె హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ ఇప్పటికే హెచ్చరించారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు వారి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రవేశం కల్పించడానికి "బ్యాక్ డోర్" అభివృద్ధి చేయాలని పటేల్ సోషల్ మీడియా సంస్థలకు పిలుపునిచ్చారు.

 

వాట్సాప్‌లో కొత్త అప్డేట్: వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌కు షేర్ చేయడంవాట్సాప్‌లో కొత్త అప్డేట్: వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌కు షేర్ చేయడం

బ్యాక్ డోర్
 

ప్రవేశం కొరకు బ్యాక్ డోర్ నిర్మించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలను మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే దీనిని ఉపయోగించడం వలన వినియోగదారుల ప్రైవసీ మరియు భద్రతను దెబ్బతీస్తాయి అని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

స్మార్ట్‌ఫోన్‌ను కళ్ళజోడుగా మార్చే ప్రక్రియలో ఫేస్‌బుక్స్మార్ట్‌ఫోన్‌ను కళ్ళజోడుగా మార్చే ప్రక్రియలో ఫేస్‌బుక్

యుఎస్ మరియు UK

క్లౌడ్ యాక్ట్ వంటి ప్రభుత్వ విధానాలు కంపెనీలకు చెల్లుబాటు అయ్యే చట్టపరమైన అభ్యర్ధనలను స్వీకరించినప్పుడు అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందించడానికి అనుమతిస్తాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఒకరికొకరు పౌరులను దర్యాప్తు చేయకూడదని యుఎస్ మరియు UK అంగీకరించాయి అని బ్లూమ్బెర్గ్ ఒక నివేదిక ఇచ్చింది. మరణశిక్ష విధించే ఏ సందర్భాలలోనైనా బ్రిటిష్ సంస్థల నుండి పొందిన సమాచారాన్ని యుఎస్ ఉపయోగించలేమని కూడా నివేదిక పేర్కొంది.

 

ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన వాట్సాప్ గ్రూప్ ఫీచర్లుప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన వాట్సాప్ గ్రూప్ ఫీచర్లు

టెక్ కంపెనీలు

టెక్ కంపెనీలు చట్ట అమలుకు సహాయం చేయటం ఇదే మొదటిసారి కాదు. ఆస్ట్రేలియా కూడా డిసెంబరులో ఇలాంటి చట్టాన్ని ఆమోదించింది. ఇది అనుమానిత నేరస్థుల విషయంలో దాచిపెట్టిన సమాచారాన్ని పంచుకోవడం తప్పనిసరి. మేలో ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, వాట్సాప్ మరియు ఇతరులు GCHQ యొక్క ప్రతిపాదనకు వ్యతిరేకంగా వెనక్కి నెట్టారు. ఇది ఎన్క్రిప్షన్ను విచ్ఛిన్నం చేయకుండా ప్రైవేట్ మెసేజ్ లను యాక్సెస్ చేయడానికి యుకె పోలీసులకు మార్గాన్ని అందించింది. "ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఆ హక్కును రక్షించడంలో సహాయపడుతుంది అని ఫేస్‌బుక్ తెలిపింది.

Best Mobiles in India

English summary
A New Treaty With US Allows UK Police To Have Access Over Facebook And WhatsApp Texts Of Suspects

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X