ట్విట్టర్ కొత్త వర్సన్ వింతలు, విశేషాలు..

Posted By: Super

ట్విట్టర్ కొత్త వర్సన్ వింతలు, విశేషాలు..

 

ప్రస్తుత సమాజంలో మానవుని దైనందిన జీవితంలో భాగస్వామిగా కలిసిపోయాయి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్. యూజర్స్ కోసం కొత్త కొత్త ఆలోచనలతో కొత్త ఫీచర్స్‌ని ప్రవేశపెడుతున్నాయి ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి వెబ్ సైట్స్. ఇదంతా మీకు ఇప్పడు ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.. కొన్ని నెలలు క్రితం ట్విట్టర్ '#NewTwitter client' పేరుతో కొత్త వర్సన్‌ని ప్రారంభించనుందని తెలిపిన సంగతి పాఠకులకు గతంలో తెలియజేయడమైంది. ట్విట్టర్ కొన్ని వారాలలో యూజర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ట్విట్టర్ వర్సన్‌కి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలను పాఠకులకు తెలియజేస్తున్నాం.

ట్విట్టర్ కొత్త వర్సన్ వింతలు, విశేషాలు..

 

ఎవరైతే కస్టమర్స్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే మొబైల్ ఫోన్స్‌ని వాడుతున్నారో వారు కొత్త వర్సన్ ట్విట్టర్‌ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ట్విట్టర్ కల్పించింది. ఇది మాత్రమే కాకుండా ట్విట్టర్ కొత్త వర్సన్‌కి సంబంధించిన 'వెబ్ క్లయింట్'ని త్వరలో పొందుతారని తెలియజేసింది.

ఆండ్రాయిడ్ యూజర్స్ : https://market.android.com/details?id=com.twitter.android&feature=search_result#?t=W251bGwsMSwyLDEsImNvbS50d2l0dGVyLmFuZHJvaWQiXQ..

ఐవోఎస్ యూజర్స్: http://itunes.apple.com/us/app/twitter/id333903271?mt=8

ట్విట్టర్ కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ వర్సన్‌లో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ ప్ర్తత్యేకత ఏంటంటే ట్విట్టర్ సర్వీసుని ప్రపంచ జనాభా ఏవిధంగా ఉపయోగించవచ్చో ఐకాన్స్ రూపంలో సంక్షిప్త సమాచారం జత చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇమేజిని ఈ క్రింద పాఠకులు చూడొచ్చు. ఇది మాత్రమే కాకుండా ట్విట్టర్‌లో ట్వీట్స్ చేసేటప్పుడు ముఖ్య భూమికను పోషించే '# టాగ్' ఎలా వాడాలి, '# టాగ్' ఉపయోగం ఏంటీ అనే విషయం సంక్షిప్తంగా అందజేశారు.

 

ట్విట్టర్ కొత్త వర్సన్‌లో చేసిన మార్పులు అన్నింటిని కూడా యూజర్స్ తెలుసుకునేందుకు గాను కొత్త వర్సన్‌కి సంబంధించిన వీడియోని ఈ లింక్‌లో(http://fly.twitter.com/)చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot